తండ్రికి కూతురు ఝలక్ …. ఇంటినుంచి కోటి రూపాయల డిమాండ్ …

తండ్రికి కూతురు ఝలక్ …. ఇంటినుంచి కోటి రూపాయల డిమాండ్ …
-రూ.కోటి ఇవ్వ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటావంటూ తండ్రికి మెసేజ్ పంపిన బాలిక‌
-త‌ల్లిదండ్రులు మంద‌లించ‌డంతో చిన్నారి మ‌న‌స్తాపం
-వారిని బెదిరించాల‌ని నిర్ణ‌యం
-ల్యాప్ టాప్ నుంచి తండ్రికి మెసేజ్ పంపిన బాలిక‌
-రూ.కోటి ఇవ్వ‌క‌పోతే కుమారుడు, కుమార్తెను చంపేస్తానని బెదిరింపు

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేదనేది నిన్నటి మాట ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. సీసీ టీవీ ఫుట్ ఏజ్ లు వచ్చాయి. ట్రాకింగ్ ,కాల్ డేటా గుర్తింపు , ఎక్కడ నుంచి మెస్సేజ్ పంపారు . సెల్ కాల్ ఎక్కడ నుంచి చేస్తున్నారు అనేది వచ్చాయి. దానితో ఎక్కడ దొంగానైనా ఇట్టే పెట్టె వ్యవస్థ వచ్చింది. దానితో తండ్రిని ఇంటినుంచి బెదిరించిన కూతురు ను పట్టేచారు పోలీసులు … ఇది తెలుసుకున్న తండ్రి అమ్మ గడుగ్గాయి అంటూ కూతురు చేసిన పనికి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన పోలీసులకు చేసిన ఫిర్యాదు ను వెనక్కు తీసుకున్నారు. ఇది ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ….

కోటి రూపాయ‌లు ఇవ్వ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటావంటూ త‌న తండ్రికి మెసేజ్ పంపింది 11 ఏళ్ల‌ ఓ బాలిక. ఆ మెసేజ్ ఎవ‌రు పంపారో తెలియక భ‌య‌ప‌డిపోయిన ఆ తండ్రి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు బాలికే త‌న తండ్రికి మెసేజ్ పంపింద‌ని గుర్తించారు.

ఈ ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌, శాలిమార్‌ గార్డెన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇటీవల ఆ అమ్మాయిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైంది. వారిని భ‌య‌పెట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. తండ్రి ల్యాప్‌టాప్ తీసుకుని దాని నుంచే ఆయనకు మెసేజ్ పంపింది.

త‌న‌కు కోటి రూపాయ‌లు ఇవ్వాలని లేదంటే ఆయన కుమారుడు, కుమార్తెను చంపేస్తానని గూండాల మాదిరిగా బెదిరించింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మెసేజ్ ఆయ‌న‌ ఇంట్లో నుంచే వచ్చిందని గుర్తించిన పోలీసులు బాలికే ఈ ప‌ని చేసింద‌ని తేల్చారు. ఆమెపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌ని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: