బండి సంజయ్ పాదయాత్ర వాయిదా…

బండి సంజయ్ పాదయాత్ర వాయిదా
-ఈ నెల 9న ప్రారంభం కావాల్సి ఉన్న పాదయాత్ర
-పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈ నెల 24 కు వాయిదా
-ఈటల పాదయాత్రకు కూడా తాత్కాలిక విరామం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించాలనుకున్న పాదయాత్ర వాయిదా పడింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఆగస్ట్ 9న చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించామని… అయితే, పార్లమెంటు సమావేశాలు, ముఖ్యమైన బిల్లుల నేపథ్యంలో పాదయాత్రను ఈ నెల 24కు వాయిదా వేశామని తెలిపారు.

ఈటల రాజేందర్ మోకాలికి ఆపరేషన్ జరిగిందని… ఈ నేపథ్యంలో హుజూరాబాద్ లో ఆయన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇస్తున్నామని ప్రేమేందర్ రెడ్డి చెప్పారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కిషన్ రెడ్డి తొలిసారి హైదరాబాదుకు వస్తున్నారని తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: