Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు: మంద కృష్ణ మాదిగ!

దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు: మంద కృష్ణ మాదిగ
-హుజురాబాద్ లో ఓడిపోతే 2023లో అధికారానికి దూరమవుతారు
-అందుకే దళితబంధు పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు
-దళిత ఓట్ల కోసమే ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు

దళిత బందు ఒక పచ్చి మోసం … ఇది హుజురాబాద్ ఉపఎన్నిక కోసం కేసీఆర్ ఆడుతున్న ఒక నాటకం …ఓట్ల కోసం చేస్తున్న ఒక దగా .. ఒక్క హుజురాబాద్ లోనే ఎందుకు అమలు చేస్తున్నావంటే ఓట్లకోసమే అని స్వయంగా ముఖ్యమంత్రే ఒప్పుకుంటున్నారు . అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కేసీఆర్ మోసాలపై విరుచుక పడ్డారు.

రాష్ట్రంలో మొత్తం ఉన్న దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.హుజురాబాద్ లో ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు అందజేయాలని డిమాండ్ జేశారు. ఎన్నికలు వస్తేనే పధకాలు అమలు అవుతున్నాయనే అందువల్ల ఎమ్మెల్యే లను రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతున్న విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో ఎమ్మెల్యే ల రాజీనామా డిమాండ్ ఊపందుకున్నది . కొందరు ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యే కూడా తమ నియోజకవర్గానికి నిధులు వస్తాయంటే తాము కూడా రాజీనామాకు సిద్ధమని ప్రకటిస్తున్నారు.

దళితబంధు పేరుతో దళితులను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలవుతుందని… అందుకే అధికారాన్ని కోల్పోతామనే భయంతోనే కేసీఆర్ దళితబంధు పేరుతో సరికొత్త నాటకానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత ఓట్ల కోసమే ఈ పథకాన్ని తీసుకొస్తున్నారని అన్నారు.

దళితుల జీవితాలలో సమూల మార్పులను తీసుకొచ్చేందుకు దళితబంధును తీసుకొస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.

Related posts

ఈ నెల 26న రాజ్‌భవన్‌ల ముట్టడి: కిసాన్‌ సంయుక్త మోర్చా…

Drukpadam

పరిటాల శ్రీరామ్ కూల్ స్పందన …

Drukpadam

“ ఏపీకి హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాం”… కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి!

Drukpadam

Leave a Comment