ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి.. మంత్రి వర్గసమావేశం లో నిర్ణయం…

ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి.. మంత్రి వర్గసమావేశం లో నిర్ణయం…
-హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిపై పెరుగుతున్న ఉత్కంఠ
-బీసీ అభ్యర్థికే టికెట్ అంటూ లీకులు
-స్వర్గం రవి అభ్యర్థిత్వంపై చర్చ
-ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్‌రెడ్డి
-హుజూరాబాద్‌ నుంచి బీసీని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ యోచన
-కౌశిక్‌రెడ్డికి నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవి

హుజురాబాద్ ఉపఎన్నికల్లో టికెట్ ఆశించిన పాడి కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి దక్కనుండగా , స్థానిక నేతకు బలమైన బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం . అయితే ఎవరు బలమైన బీసీ నాయకుడు …స్వర్గం రవి నేనా అనే చర్చ జరుగుతుంది. యువకుడు ఉత్సవ వంతుడైన రవి కి ఇస్తే బీసీ నాయకుడికి టికెట్ ఇచ్చినట్లు అవుతుందని అందువల్ల ఆయనకే ఇస్తారని నియోజకవర్గంలో విస్తృత ప్రచారం జరుగుతుంది. రాజకీయ చాణిక్యుడైన కేసీఆర్ ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉపయోగించుకుంటారో అనే చర్చ జరుగుతుంది.

హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ యస్ గెలుపుకోసం చేయని ప్రయత్నంలేదు…. దళిత బందు తెచ్చారు. చేనేతకు సహాయం అంటున్నారు. ఉన్న పథకాలే కాకుండా ప్రతిఇంటికి ఒక పథకం అమలు చేయాలనీ నిర్ణయించారు. అనేకమంది ని పార్టీలో చేర్చుకున్నారు. మరికొంత మందిని చేర్చుకునేందుకు పథక రచన చేస్తున్నారు. ఇప్పడు చేరిన వారిలో ఎవరికీ సీటు ఇస్తారో తెలియదు .చేరిన వారిలో ఎల్ వి రమణ , పాడి కౌశిక్ రెడ్డి , ఇనగాల పెద్దిరెడ్డి , స్వర్గం రవి లాంటి వారు ఉన్నారు. పార్టీ లో చేరాక ముందే పాడి కౌశిక్ రెడ్డి తనకే టీఆర్ యస్ సీటు అని ప్రచారం చేసుకున్నారు. అంటే ముందుగానే ఆయన కు సీటు ఆఫర్ చేసినట్లు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆయన్న నామినేటెడ్ ఎమ్మెల్సీ గా గవర్నర్ కోట కింద ఎంపిక చేయాలనీ కాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి ఉపఎన్నిక టికెట్ రేసులో లేరు .

ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ మంత్రిమండలి ఆయనను నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఫారసు చేసింది.

నిజానికి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉప ఎన్నికల బరిలో దిగుతారన్న ప్రచారం జరిగింది. అయితే, ఆ స్థానాన్ని బీసీకి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీంతో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా పంపుతామని హామీ ఇచ్చారని, అందుకనే నామినేటెడ్ కోటాలో ఆయనకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో హుజూరాబాద్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠ మొదలైంది. ఈ క్రమంలో టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి ఎల్.రమణ, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరు హుజూరాబాద్ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

%d bloggers like this: