Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కచ్చితమైన జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం నుంచి టీటీడీకి ప్రశంసాపత్రం!

కచ్చితమైన జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం నుంచి టీటీడీకి ప్రశంసాపత్రం!
-దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టి నాలుగేళ్లు
-కచ్చితంగా చెల్లింపులు చేసే సంస్థలకు సన్మానం
-క్రమం తప్పకుండా చెల్లిస్తున్న టీటీడీ
-11 రాష్ట్రాల్లో టీటీడీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్

దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టి నాలుగేళ్లయిన సందర్భంగా జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్న వారిని సన్మానించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ జాబితాలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా ఉంది. ఈ క్రమంలో టీటీడీకి కేంద్రం నుంచి ప్రశంసాపత్రం లభించింది. సకాలంలో జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం ఈ మేరకు అభినందించింది. 2021 మార్చి 31 వరకు జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయడంలోనూ, పన్ను చెల్లింపులకు గాను టీటీడీకి ఈ ప్రశంసాపత్రం ఇచ్చారు.

దేశంలోని 11 రాష్ట్రాల్లో లావాదేవీల నిమిత్తం టీటీడీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంది. అందులో, రెండు రాష్ట్రాల్లో టీటీడీ జరిపిన లావాదేవీల జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం నుంచి ఈ ప్రశంసాపత్రం అందింది. దేశంలో 1.3 కోట్ల సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోగా, అందులో 54,439 సంస్థలు జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్నాయి.

Related posts

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గృహ నిర్బంధం.. జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత

Drukpadam

మాకు తెలియకుండా ధూళిపాళ్లను జైలుకు ఎలా తరలిస్తారు?: ఏసీబీపై కోర్టు ఆగ్రహం…

Drukpadam

తవ్వకాల్లో బయటపడిన చార్మినార్ భూగర్భ మెట్లు!

Drukpadam

Leave a Comment