Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన.. కేంద్రం స్పష్టీకరణ!

2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన.. కేంద్రం స్పష్టీకరణ
-ఆర్టికల్ 170 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన
-2026 జనాభా లెక్కల ప్రకారం నిర్వహణ
-రేవంత్ ప్రశ్నకు హోం శాఖ సమాధానం

తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నీళ్లు చల్లింది . నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేదని తేల్చి చెప్పింది .రాష్ట్రాన్ని రెండుగా విభజించిన సందర్భంగా రెండు రాష్ట్రాలలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుతామని విభజన చట్టంలో స్పష్టం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు నియోకవర్గాల పెంపుపై ఏంటో ఆశగా ఎదురుచూస్తున్నాయి. 2014 -2019 మధ్య కాలంలో పెంపు జరుగుతున్నట్లు అప్పటి ఏపీ ప్రభుత్వం భావించింది. దీనిపై కేంద్రాన్ని ఒత్తిడి చేసింది. 2026 లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటున్నందున అప్పటికి ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని అందరు భావించారు. కానీ నేడు లోకసభలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నకు హోమ్ శాఖ సహాయమంత్రి పార్లమెంట్ లో సమాధానం చెబుతూ తెలుగు రాష్ట్రాలలో నియోజవర్గాల పునర్ విభజన ఇప్పట్లో సాధ్యం కాదని వారి ఆశలపై నీళ్లు చల్లారు.

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు లేనట్టేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎప్పుడు చేసేది వెల్లడించింది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2031 తర్వాతే నియోజకవర్గాలను పునర్విభజిస్తామని స్పష్టం చేశారు. 2026 జనాభా లెక్కల ప్రకారం చేపడతామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆయన తెలిపారు.

2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని కేంద్ర స్పష్టం చేసింది. అదే సందర్బాల్లో 2031 తరవాతనే ఉంటుందని కేంద్రమంత్రి నియానంద రాయ్ చెప్పిన సమాధానంపై తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలు కూడా కంగు తిన్నారు. ఒక పక్క జమ్మూ కాశ్మీర్ లో నియోజవర్గాల పునర్విభజనపై స్వయంగా ప్రధాని అఖలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే .ఆంటే కేంద్రం జమ్మూ కాశ్మీర్ విషయంలో ఒకరకంగా తెలుగు రాష్ట్రాల విషయంలో మరో రకంగా వ్యవహరించడంపై కేంద్రం వైఖరిని తప్పుపడుతున్నాయి.

 

Related posts

నకిలీ మందులు ,నాణ్యత లేని ఆహారం… ప్రజల జీవితాలతో చెలగాటం..!

Drukpadam

కేసీఆర్ చెప్పిన మాటలు తెలంగాణ మంత్రులు వినలేదా?: సజ్జల ఫైర్

Drukpadam

మునుగోడు ఎన్నికల్లో మూకుమ్మ‌డి నామినేష‌న్లు…

Drukpadam

Leave a Comment