Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ!

హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ!
-ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
-మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించిన రాహుల్
-ఈరోజు పరామర్శించనున్న కేజ్రీవాల్

ఢిల్లీ లోని ఒక శ్మశానవాటిక లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేయడం పై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లు ఎత్తిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం అక్కడకు వెళ్లి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ ఆప్రాంతానికి వస్తున్నా సంగతి తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. రాహుల్ ఈ బాలిక తల్లిదండ్రులను తన వాహనంలో కూర్చో బెట్టుకొని వారితో మాట్లాడారు. వారికీ దైర్యం చెప్పారు. భాద్యులపై చర్యలు తీసుకునేలా వత్తిడి తెస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. దేశ రాజధానిలో ఈ సంఘటన జరగటం పట్ల రాహుల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ,భాద్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన కలకలం రేపింది. ఇప్పుడు అది రాజకీయ రంగు పులుముకుంది. బాధితురాలి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలుసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులను తన వాహనంలో కూర్చోబెట్టుకుని, వారిని పరామర్శించారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పరామర్శించబోతున్నారు. అంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఖీ బిడ్లాన్, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ తదితరులు కూడా పరామర్శించారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే, నాంగల్ శ్మశానవాటిక నుంచి నీటిని తెచ్చేందుకు వెళ్లిన తొమ్మిదేళ్ల చిన్నారి ఆ తర్వాత తిరిగి రాలేదు. ఆ తర్వాత ఆమె మృతదేహం శ్మశానవాటిక వద్ద కనిపించింది. కరెంట్ షాక్ కొట్టి ఆమె చనిపోయిందని భావించిన తల్లిదండ్రులు ఆమెకు దహన సంస్కారాలను నిర్వహస్తుండగా… విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు వచ్చి చితిమంటలపై నీటిని చల్లి, మృతదేహాన్ని బయటకు తీశారు. అంతేకాదు, బాలిక మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఇండిగో విమానం ఎయిర్‌హోస్టస్‌తో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన!

Drukpadam

మహిళను చంపి వెళ్లి.. వెనక్కి వచ్చి మరో ఇద్దర్ని చంపాడు.. అమెరికాలో ఉన్మాది ఘాతుకం!

Drukpadam

డ్రగ్స్ వాడుతూ దొరికితే ఎవరిని వదలం.. హైదరాబాద్ సీపీ హెచ్చరిక!

Drukpadam

Leave a Comment