Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జలాల వివాదం: ఏపీ పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ చేసిన సీజేఐ !,

కృష్ణా జలాల వివాదం: ఏపీ పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ చేసిన సీజేఐ,
– ప్రధాన న్యాయమూర్తి బెంచ్ లోనే విచారణ జగగలనే అభ్యర్థనకు సిజెఐ నో
-కేసును మరో బెంచ్ కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వ్యవహారంలో న్యాయపరమైన పరిష్కారం కోరుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. కాగా, సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. అయితే, కేంద్రం విజ్ఞప్తిని నిరాకరించిన సీజేఐ ధర్మాసనం.. ఏపీ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తాను విచారణ చేపట్టనని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

ఇది ఇలావుండగా, కృష్ణానది జలాల వివాదంపై రివర్‌బోర్డు సభ్యులు గురువారం రాయలసీమలో పర్యటించనున్నారు. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. బృందంలో తెలంగాణకు చెందినవారు ఎవరూ ఉండకూడదని బోర్డుకు ఇప్పటికే ఏపీ సర్కార్‌ షరతు విధించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలతో.. కేఈర్బీఎం బృందం పర్యటించబోతోంది. ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించి ఎన్జీటీకి నివేదికను ఇవ్వనుంది.

మరోవైపు, మంగళవారం జరిగిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమన్వయ భేటీకి.. తెలంగాణకు చెందిన సభ్యులు గైర్హాజరయ్యారు. గెజిట్‌ ప్రకారం ప్రాజెక్టుల స్వరూపంపై అభ్యంతరాలున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నందున వివరాలు ఇవ్వాలని బోర్డు సభ్యులు కోరగా అందుకు ఏపీ నిరాకరించింది. తెలంగాణ మాత్రం పూర్తిస్థాయి బోర్డు భేటీ జరిపిన తర్వాతే.. సమన్వయ కమిటీ భేటీ జరపాలని కోరుతోంది. ఇదే అంశంపై గతంలో గోదావరి యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. కృష్ణాబోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని అత్యవసరంగా అయినా ఏర్పాటు చేయాలని.. ఆ తర్వాతే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ వాదిస్తోంది.

 

Related posts

ఏపీలో రోడ్డు ప్రమాద బాధితులకు ఇక నగదు రహిత చికిత్స: సీఎం జగన్

Drukpadam

ఏపీలో మల్లి ఎన్నికల గంట మోగింది: మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు!

Drukpadam

ఖమ్మం అసెంబ్లీ సీటుపై పట్టుబిగించిన మంత్రి అజయ్ …

Drukpadam

Leave a Comment