తూర్పు గోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం… ఎంత పెద్దదో!

తూర్పు గోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలంఎంత పెద్దదో!
చింతలూరులో కనిపించిన రాచనాగు
సరుగుడు తోటలో సంచారం
హడలిపోయిన స్థానికులు
పామును పట్టుకోవాలంటూ అధికారులకు విజ్ఞప్తి

అసలే పాము అది కింగ్ కోబ్రా …. దానిపోదువు 12 అడుగులపైనేఒక్కసారిగా అది సరుగుడు తోటలో కనిపించడంతో హడలెత్తారు . పొడువు పెద్దగా ఉన్న అధిహుషారుగా పరుగులు తీస్తుంది. దాన్ని దగ్గరకు వెళ్లేందుకు సైతం దాన్ని చేసేందుకు వచ్చిన వారు హడలి పోయారు. దాన్ని పట్టుకునేందుకు పాములు పెట్టె వాళ్ళు కూడా సాహసించలేదు. అయితే ఆటవి అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోపునే అది అక్కడనుంచి జారుకుని పోయింది. ఎటు పోయిందనేది ఎవరు గమనించలేదు.

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం, చింతలూరులో భారీ కింగ్ కోబ్రా కనిపించింది. పెద్ద చెరువు వెనుకభాగంలో ఒడ్డు లోవరాజు, సూరిబాబు అనే వ్యక్తులకు చెందిన సరుగుడు తోటలో కింగ్ కోబ్రాను చూసిన స్థానికులు హడలిపోయారు. ఇది 12 అడుగుల పొడవుతో భీతి గొలిపేలా ఉండడంతో దీన్ని సమీపించేందుకు అక్కడివారికి ధైర్యం చాల్లేదు. దూరం నుంచి తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు.

రాచనాగును పట్టుకుని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టాలని చింతలూరు ప్రజలు అటవీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాగా, జనాల అలికిడి కావడంతో విషసర్పం అక్కడ్నించి నిష్క్రమించింది.

Leave a Reply

%d bloggers like this: