వాసాలమర్రి ఇక బంగారుతల్లి … దళిత బందు అమలు ఇక్కడ నుంచే :సీఎం కేసీఆర్ !

వాసాలమర్రి ఇక నుంచి బంగారుమర్రి దళిత బందు అమలు ఇక్కడ నుంచే :సీఎం కేసీఆర్!
– దళిత బందు కింద 76 మందికి రేపే 10 లక్షల చొప్పున చెక్కుల పంపిణి
-హుజురాబాద్ లో దళిత బందు లాంఛనమే
-వాసాలమర్రి దళితవాడల్లో కేసీఆర్​ పర్యటన
-సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం
-గ్రామంలో పారిశుద్ధ్య పనుల పరిశీలన
-రైతు వేదికలో గ్రామస్థులతో సమావేశం

దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్ దళిత బందు పథకాన్ని గ్రామంలోని 76 మంది లబ్ది దారులకు ప్రకటించారు. దళిత బందు ఇక్కడ నుంచే ప్రారంభమైందని గ్రామస్తుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ సందర్బాగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హుజురాబాద్ లో దళిత బందు లాంఛనమేనని అన్నారు. గ్రామం బాగుపడాలని అందరు తలుచుకుంటే అన్ని జరిగిపోతాయని అన్నారు. గ్రామంలో అన్ని ఇళ్లను కూలగొట్టి కొత్త ఇళ్లను కట్టుకుందామని అన్నారు. వెంటనే పనులు ప్రారంభించుకోవచ్చునని సీఎం అన్నారు. రోడ్లు , విద్యుత్ , మంచినీరు అన్ని సౌకర్యాలు కల్పించుకుందామని అన్నారు.

రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన.. యాదాద్రి జిల్లా వాసాలమర్రికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని, దళితవాడల్లో కలియ తిరిగారు. అధికారులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

అనంతరం స్థానికంగా ఉన్న రైతువేదికలో గ్రామస్థులతో ఆయన సమావేశమయ్యారు. తర్వాత గతంలో ఇచ్చిన హామీల అమలు తీరుపై అధికారులతో సమీక్షిస్తారు. జూన్ 22న వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. గ్రామస్థులకు మంచి విందు భోజనం ఇచ్చారు. అలాగే వారితో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. అందరు కలిసి పని చేసుకోవాలని అన్నారు. వాసాలమర్రి రూపురేఖలు మార్చుకుందామని అందరికి కొత్త ఇళ్ల కట్టించుకుందామని అన్నారు . వెంటనే పనులు ప్రారంభించుకోవచ్చునను తెలిపారు. తాను నిరంతరం వాసాలమర్రి గ్రామం లో జరుగుతున్నా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష జరుపుతానని అన్నారు. సీఎం వెంట జిల్లా మంత్రి , స్థానిక ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్ , ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

నాడు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంపై సమీక్ష చేసేందుకు 42 రోజుల తర్వాత మళ్లీ ఆయన వాసాలమర్రికి వెళ్లారు. తదుపరి కార్యాచరణపై నేతలు, అధికారులు, గ్రామస్థులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

%d bloggers like this: