Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

దేశంకాని దేశంలో భార్యను నడిబజార్లో వదిలేసిన భర్త ….న్యాయంకోసం నవవధువు పోరాటం …

దేశంకాని దేశంలో నడిబజార్లో వదిలేసిన భర్త ….న్యాయంకోసం నవవధువు పోరాటం
పైసా ఇవ్వకుండా వదిలేసి వెళ్లిన భర్త..
అమెరికాలోని భారత ఎంబసీని ఆశ్రయించిన నవ వధువు
మార్చిలో అమెరికా వెళ్లిన దంపతులు
అదనపు కట్నం కోసం వేధించాడన్న బాధిత మహిళ
విడాకుల నోటీసులు పంపిన భర్త ..ఫోన్ చేసిన స్పందించని వైనం
అమెరికా విదేశాంగ శాఖకూ ఫిర్యాదు

అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చింది. ఆ ఇంట్లోని వాళ్లు, ఆ అమ్మాయి మురిసిపోయారు. కానీ, ఆ మురిపాన్ని కట్టుకున్నోడు, మెట్టినింటివారు మూణ్నాళ్లయినా ఉండనివ్వలేదు. అమెరికాకు తీసుకెళ్లిన దగ్గర్నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. అనుమానం అనే పిశాచం అతడిని పట్టుకుంది. ఆమెను ఒంటరిగా వదిలేశాడు. పైసా ఇవ్వకుండా వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఆమె వాషింగ్టన్ లోని భారత ఎంబసీకి ఫిర్యాదు చేసింది. న్యాయం కోసం పోరాడుతోంది.

పెళ్లయ్యాక ఈ ఏడాది మార్చిలో అమెరికాకు వచ్చామని, వర్జీనియాలోని మెక్ లాన్ లో ఉంటున్నామని బీహార్ కు చెందిన ఆ బాధిత నవ వధువు ఎంబసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అప్పటి నుంచి ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికా తీసుకొచ్చినప్పటి నుంచి తనకు అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా ఇంట్లో వేధింపులు మొదలయ్యాయని తెలిపింది.

బాత్రూంకు వెళ్లినా భర్త తనపై అనుమానపడేవాడని పేర్కొంది. గర్భం రాకుండా తానేదో చేస్తున్నానని వేధించేవాడని తెలిపింది. బాత్రూంకు వెళ్తే తలుపులు తీసి పెట్టాలంటూ వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఫోన్ కూడా వాడనిచ్చేవాడు కాదని, తాముండే ఫ్లోర్ లో కేవలం చెత్త వేయడానికి మాత్రమే ఒంటరిగా వెళ్లనిచ్చేవాడని చెప్పింది. ఓరోజు రోడ్డు మీద వెళ్తుండగా తనను మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ చెప్పించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

భర్త పైసా ఇవ్వకుండా వదిలేసి వెళ్లాడని, ఎటు వెళ్లాలో తనకు తెలియట్లేదని ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని తన అత్తమామలకు తెలియజేసినా.. తనను భారత్ కు తీసుకురావాలంటే అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేశారని ఆరోపించింది. ఆ వేధింపులు భరించలేక వర్జీనియా పోలీసులకు జూన్ 15న ఫిర్యాదు చేశానని చెప్పింది. పోలీసులు అతడిపై క్రిమినల్ కేసు పెట్టారని తెలిపింది. ఎంబసీతో పాటు భారత ప్రభుత్వ అధికారులకూ ఫిర్యాదు చేశానని బాధిత మహిళ చెప్పింది. ఇటు అమెరికా విదేశాంగ శాఖకూ ఆమె ఫిర్యాదు చేసింది.

కాగా, ఆమె భర్త ఫ్రెడ్డీ మ్యాక్ అనే సంస్థలో క్వాంటిటేటివ్ అనలిటిక్స్ గా పనిచేస్తున్నాడు. ఫోన్ ద్వారా అతడిని సంప్రదిస్తే.. కావాలని తనను ఇరికించారని అతడు ఫోన్ పెట్టేశాడు. ఎఫ్ 1 స్టూడెంట్ వీసా కింద అతడు అమెరికాలో ఉంటున్నట్టు తెలిసింది. ఆ విషయం అడగ్గా యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ కాలేజ్ క్యాంపస్ అని ఒకసారి.. బాల్టిమోర్ క్యాంపస్ అని మరోసారి చెప్పాడు. తన భార్యకు విడాకుల నోటీసులు పంపించాడు. ప్రస్తుతం బాధిత మహిళ సియాటిల్ లోని బంధువుల ఇంట్లో ఉంటోంది. అమెరికాలో గృహ హింసను ఎదుర్కొనే మహిళల రక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ సాయంతో ఆమె న్యాయం కోసం పోరాడుతోంది.

Related posts

పశ్చిమబెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. తొమ్మిదికి పెరిగిన మృతుల సంఖ్య!

Drukpadam

400 కిలోల టమాటా ఎత్తుకెళ్లిన దొంగలు, కేసు నమోదు…

Drukpadam

రూ.21 కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత..

Drukpadam

Leave a Comment