Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దేవినేని ఉమ కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు …చంద్రబాబు ఫైర్!

దేవినేని ఉమ కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు …చంద్రబాబు ఫైర్
-హింసించి ఆనందించడం జగన్ కు పరిపాటిగా మారిందని ధ్వజం
-ఉమ కాన్వాయ్ ని అడ్డుకోవడం హేయమని విమర్శలు
– కావాలనే కవ్విస్తున్నారని వెల్లడి
-చట్టాన్ని చుట్టంగా మార్చుకున్నారని వ్యాఖ్యలు
-ఉమ అనుచరుల కాన్వాయ్ ని నిలిపి వేసిన పోలీసులు
-రోడ్ పైనే బైఠాయించిన ఉమ -ట్రాఫిక్ కు అంతరాయం

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బైలు పై విడుదలై వస్తున్నా దేవినేని ఉమ కాన్వాయ్ ని భీమడోలు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఉమ ప్రయాణిస్తున్న కార్ ను వదిలి మిగతా కార్లను నిలిపి వేయడంతో వాహనం దిగిన ఉమ నిలిపి వాహనాలను కూడా వదిలి పెట్టాల్సిందేనని ఉమ డిమాండ్ చేశారు. పోలీసులు వాటిని వదిలేందుకు నిరాకరించడంతో జాతీయరహదారిపైనే కూర్చొని నిరసన తెలిపారు. టీడీపీ నేతల రోడ్ పై బైఠాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.ఈ సంఘటనపై టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు.

జగన్ కు హింసించి ఆనందించడం శాడిజంగా మారిందని అన్ని వడ్డీతో సహా తీర్చుకుంటామని అన్నారు.ఇప్పటికైనా పైశాచిక ఆనందాన్ని పక్కనపెట్టి పరిపాలన సాగించాలిని హితవుపలికారు. లేకపోతె ప్రజలే బుద్ధిచెపుతారని ధ్వజమెత్తారు. దేవినేని ఉమ కాన్వాయ్ ను అడ్డుకోవడం హేయమని వ్యాఖ్యానించారు. హింసించి ఆనందించడం జగన్ కు పరిపాటిగా మారిందని అన్నారు. జనం నీరాజనాలు పలుకుతుంటే తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అసలు, జాతీయ రహదారిపై పోలీసులు ఏ విధంగా వాహనాలు ఆపుతారని ప్రశ్నించారు. చట్టాన్ని అధికార పక్షం చుట్టంలా మార్చుకుందని విమర్శించారు.

ఇవాళ దేవినేని ఉమా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు వద్ద ఉమా కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఉమా ప్రయాణిస్తున్న కారును వదిలి, ఆయన అనుచరుల కారులను మాత్రం నిలిపివేశారు. దాంతో ఉమా, పట్టాభి తదితర టీడీపీ నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా భీమడోలు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. టీడీపీ శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Related posts

వెంకయ్యను జగన్ అడ్డుకున్నారన్న ప్రచారంలో నిజంలేదు …విజయసాయి రెడ్డి !

Drukpadam

పార్లమెంట్ లో పెగాసస్ మంటలు …గందరగోళం స్పీకర్ ఆగ్రహం!

Drukpadam

నేను క్రాస్ ఓటింగ్ చేసినట్లు సజ్జలకు ఎలా తెలుసు?: ఆనం

Drukpadam

Leave a Comment