ఒలంపిక్స్ లో భారత్ కు ఐదు పథకాలు!

ఒలంపిక్స్ లో భారత్ కు ఐదు పథకాలు!
చ‌రిత్ర సృష్టించిన భార‌త‌ హాకీ జ‌ట్టుకు రాష్ట్రప‌తి, ప్ర‌ధాని అభినంద‌న‌లు
ఒలింపిక్స్‌‌‌లో 4 దశాబ్దాల తర్వాత పతకం
జర్మనీతో హోరాహోరీగా తలపడిన భారత్
చివరి క్వార్టర్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత ఆటగాళ్లు
దేశవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు
ఈ విజ‌యం భార‌తీయుల‌కు మ‌ర‌పురాని రోజు
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో రజతం.
రెజ్లింగ్ ప్రీ క్వార్టర్స్ లో అదరగొట్టిన వినేశ్ ఫొగట్
క్వార్టర్ ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్ ఓటమి

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు ఇప్పటివరకు ఐదు పథకాలు లభించాయి. ఇందులో రెండు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించింది . బంగారు పథకాల వేటలో చైనా అగ్రస్థానంలో ఉండగా అమెరికా రెండవ స్థానంలో ఉంది.

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. 5-4తో విజయం సాధించి 41 సంవత్సరాల తర్వాత దేశానికి పతకం అందించడంతో భార‌త హాకీ జ‌ట్టుకు శుభాకాంక్ష‌ల వెల్లువెత్తుతున్నాయి. భార‌త హాకీ జ‌ట్టు సాధించిన విజ‌యం యువ‌త‌కు ఆద‌ర్శ‌మ‌ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఒలింపిక్స్‌లో ఆ జ‌ట్టు అసాధార‌ణ ప్ర‌తిభ క‌న‌బ‌రించింద‌ని ప్ర‌శంసించారు. చారిత్ర‌క విజ‌యంతో హాకీలో కొత్త శ‌కానికి నాంది ప‌లికింద‌ని అన్నారు.

భార‌త హాకీ జ‌ట్టును చూసి దేశం గ‌ర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశానికి కాంస్యం అందించిన హాకీ జ‌ట్టుకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. ఈ విజ‌యం భార‌తీయుల‌కు మ‌ర‌పురాని రోజని చెప్పారు. యువ‌త‌కు స్ఫూర్తి క‌లిగించే విజ‌యాన్ని అందించారని పేర్కొన్నారు.

41 ఏళ్ల తర్వాత భారత్ హాకీ జట్టుకు విశ్వక్రీడల్లో మన్‌ప్రీత్ సింగ్ సేన పతకం అందించ‌డ‌తో అమృత్‌స‌ర్ లోని ఆయన నివాసం వ‌ద్ద కుటుంబ స‌భ్యులు సంబ‌రాలు జ‌రుపుకున్నారు. నృత్యం చేస్తూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. కాంస్య పతకం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 5-4తో విజయం సాధించి 41 సంవత్సరాల తర్వాత దేశానికి పతకం అందించింది. తొలి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరికి భారత జట్టు విజయం సాధించింది. మ్యాచ్ చివరి క్వార్టర్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. జర్మనీ నాలుగు గోల్స్ సాధించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.

అయితే, భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో జర్మనీకి మరో గోల్ దక్కకుండా జాగ్రత్తగా పడ్డారు. టోక్యోలో భారత జట్టు విజయం సాధించిన వెంటనే దేశంలో సంబరాలు మిన్నంటాయి. చారిత్రక విజయాన్ని అందించిన మన్‌ప్రీత్ సింగ్ సేనపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు, ఓడిన జర్మనీ ఆటగాళ్లు మైదానంలోనే కుప్పకూలి విలపించగా, ఆనందంతో భారత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టారు.

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఫైనల్లో భారత యోధుడు రవికుమార్ దహియాకు రజతం లభించింది. స్వర్ణం కోసం జరిగిన పోరులో రవికుమార్ రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జట్టుకు చెందిన జవూర్ ఉగుయేవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ ఫైనల్ పోరులో ఉగుయేవ్ కు 7 పాయింట్లు దక్కగా, రవికుమార్ 4 పాయింట్లే సాధించి రజతంతో సరిపెట్టుకున్నాడు.

కాగా, భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో ఇది రెండో రజతం. ఇంతకుముందు మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు తొలి రజతం అందించింది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు రెండు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించి, ఓవరాల్ పతకాల పట్టికలో 62వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చైనా 33 స్వర్ణాలతో అగ్రస్థానంలో ఉండగా, 27 బంగారు పతకాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అదరగొట్టింది. మహిళల 53 కేజీల విభాగం ప్రీక్వార్టర్స్‌లో స్వీడన్ రెజ్లర్ మ్యాట్‌సన్‌ సోఫియాను 7-1 తేడాతో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో ఫొగాట్ బెలారస్‌ రెజ్లర్‌తో తలపడి నప్పటికీ ఓటమి చవిచూసింది.

 

Leave a Reply

%d bloggers like this: