పులిచింత‌ల డ్యామ్ దగ్గర కొట్టక పోయిన గేటు…వృధాగా పోతున్న నీరు …

పులిచింత‌ల డ్యామ్ దగ్గర కొట్టక పోయిన గేటు…వృధాగా పోతున్న నీరు …
డ్యామ్ నుంచి నీళ్లు వ‌దులుతుండ‌గా ఊడిపోయిన గేటు..
లోతట్టు ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం
సాంకేతిక కార‌ణాల వ‌ల్ల‌ 16వ నంబర్‌ గేటు ఊడిపోయిన వైనం
ప్రకాశం బ్యారేజీకి వృథాగా నీరు
దిగువ‌కు 1,65,763 క్యూసెక్కుల నీరు
స్టాప్‌లాక్ గేట్‌తో ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొస్తామ‌న్న క‌లెక్ట‌ర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా పులిచింత‌ల డ్యామ్ నుంచి నీళ్లు వ‌దులుతుండ‌గా సాంకేతిక కార‌ణాల వ‌ల్ల‌ 16వ నంబర్‌ గేటు ఒక్క‌సారిగా ఊడిపోయింది. దీంతో ప్రకాశం బ్యారేజీకి నీరు వృథాగా పోతోంది. 1,65,763 క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు.

పులిచింతల ప్రాజక్టు వద్ద నీటి ప్రవాహానికి గేటు కొట్టుకొని పోవడంతో నీరు వృధాగా సముద్రం పలు అవుతుంది. దీంతో నీరు వృధాగా పోకుండా అడ్డుకట్ట వేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. కృష్ణ జిల్లా కలెక్టర్ కూడా ప్రాజక్టు దగ్గరకు వచ్చి పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులతో చేర్చించారు. సాధ్యమైనంత త్వరగా నీటిని అదుపు చేసేందుకు సాఫ్ట్ లాక్ గేటుతో పరిస్థిని అదుపులోకి తీసుకోని వస్తామని కలెక్టర్ తెలిపారు.

పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠస్థాయిలో నీరు నిల్వ ఉండ‌డంతో కొత్త గేటు అమర్చే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో అధికారులు ప్రత్యామ్నాయంగా స్టాప్‌లాక్‌ పరిజ్ఞానంతో నీరు వెళ్లకుండా చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌పాల‌ని భావిస్తున్నారు. ఏపీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ హుటాహుటీన పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చి ప‌రిస్థితిని పరిశీలించారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చలు జ‌రుపుతున్నారు. దీనిపై స్పందించిన కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్… స్టాప్‌లాక్ గేట్‌తో ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొస్తామ‌ని చెప్పారు. పులిచింత‌ల డ్యామ్ గేటు ఊడిపోవ‌డంతో కొన్ని ప్రాంతాల్లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు. నది ప్రవాహం నుంచి వాగులు వంకలు ఉన్నచోట్ల నీరు వెళ్లే అవకాశం ఉంది. నది ప్రవాహం కూడా పెరగటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికకారులు హెచ్చరికలు జారీచేశారు.

Leave a Reply

%d bloggers like this: