శరద్ పవార్‌ను కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ.. పోరాటానికి మద్దతు ఇవ్వాలని వినతి!

శరద్ పవార్‌ను కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ.. పోరాటానికి మద్దతు ఇవ్వాలని వినతి
-శరద్ పవార్‌కు వినతిపత్రం సమర్పించిన పోరాట కమిటీ నేతలు
-స్టీల్‌ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాలని అభ్యర్థన
-ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన శరద్ పవార్
-ఉక్కు సంకల్పంతో ఉద్యమిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రవేటీకరణ జరిగితీరుతుందని కేంద్రం స్పష్టం చేస్తుండగా ,దాన్ని ప్రవేటీకరణ కాకుండా కాపాడుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వరంలో గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. అందుకోసం వారు వెతకాని దార్లు ,తిరగని ప్రదేశం లేదు. అన్ని రాజకీయపార్టీలు , నాయకులను కలుస్తున్నారు. తమకు మద్దతు ఇచ్చి విశాఖ ఉక్కు ను కాపాడాలని వేడుకుంటున్నారు. లాభాల్లో ఉన్న పరిశ్రమను ప్రవేట్ పరం చేయడం తగదని వారు చేసి విజ్ఞప్తి పై ఢిల్లీలో పలువురు నాయకులు పాజిటివ్ గానే స్పందిస్తున్న అంత ప్రధాని మోడీ చేతుల్లోనే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ నాయకులు ఎన్సీపీ నేత శరద్ పవర్ ను కలిశారు. పార్లమెంట్ లో ఈ అమాశాన్ని లేవనెత్తి మద్దతు తెలపాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయం ప్రధాని నరేద్ర మోడీ దృష్టికి తీసుకోని వెళతానని హామీ ఇచ్చారు .

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు కోరుతూ పోరాట కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు నిన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. ఢిల్లీలో నిన్న శరద్ పవార్ నివాసంలో ఆయనను కలిసిన నేతలు వినతిపత్రం సమర్పించి ఉద్యమానికి అండగా నిలవాలని అభ్యర్థించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో అందుతున్నాయని ఈ సందర్భంగా పవార్ దృష్టికి తీసుకెళ్లారు. సొంత గనులు లేకున్నా నాణ్యమైన ఉక్కును అందిస్తోందని, ఈ పరిశ్రమపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని పేర్కొన్నారు. పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన శరద్ పవార్ ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చకు పెడతామని, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. శరద్ పవార్‌ను కలిసిన అనంతరం పోరాట నేతలు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ షణ్ముగం, బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు శ్రీరాంజీలను కలిసి మద్దతు కోరారు.

Leave a Reply

%d bloggers like this: