Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అంబేద్కర్ కు నిజమైన వారసుడు కేసీఆరే!: మోత్కుపల్లి నర్సింహులు!

అంబేద్కర్ కు నిజమైన వారసుడు కేసీఆరే!: మోత్కుపల్లి నర్సింహులు!
-దళిత బంధు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్
-వాసాలమర్రి నుంచి అమలు
-హర్షం వ్యక్తం చేసిన మోత్కుపల్లి
-దళిత బంధు పథకాన్ని ఆపడానికి చాలామంది కుట్ర చేస్తున్నారన్న మోత్కుపల్లి

సీనియర్ రాజకీయవేత్త మోత్కుపల్లి నర్సింహులు ఒకప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను వేనోళ్ల తిట్టిన నోటితోనే కీర్తిస్తున్నారు . బండ భూతులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మోత్కపల్లి లో ఇప్పడు సీఎం కేసీఆర్ ను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తో పోల్చారు. దళిత బంధు వంటి పథకం ఎక్కడా లేదని, అంత సాహసం చేసింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, తద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ లా సీఎం కేసీఆర్ కూడా చరిత్రలో నిలిచిపోతారని వెల్లడించారు. తన ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రిలో దళిత బంధు అమలు చేస్తుండడం ఎంతో ఆనందం కలిగిస్తోందని మోత్కుపల్లి చెప్పారు. ప్రజల కోసం బతికే నాయకుడు కేసీఆర్ అని అభివర్ణించారు.

దళిత బంధు పథకాన్ని ఎలా ఆపాలా అని చాలామంది చూస్తున్నారని, కుట్ర చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలో తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయగలవా? అని ప్రశ్నించారు. అన్ని పార్టీలు దళితులను దళితులుగా చూశాయే తప్ప, ఇలా దళితుల ఖాతాల్లో నేరుగా రూ.10 లక్షలు వేయడం ఎక్కడా చూడలేదని వివరించారు. అంబేద్కర్ కు నిజమైన వారసుడు కేసీఆరేనని పేర్కొన్నారు.

తెలుగుదేశంలో ఉన్న మోత్కుపల్లి చంద్రబాబు తో విభేదించి వచ్చి కొంతకాలం తటస్తంగా ఉన్న మోత్కపల్లి బీజేపీ లో చేరారు . ఇటీవల దళిత బందు పథకం చర్చించేందుకు సీఎం కేసీఆర్ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ లో ఉన్న నరసింహులు పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా సీఎం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైయ్యారు. దానిపై బీజేపీ గుర్రుగా ఉండటంతో బీజేపీ కి బై చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డ నరసింహులు సందుదొరికితే సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వావ్ రాజకీయాలు అంతే ఇవేగా మరి అంటున్నారు పరిశీలకులు …..

Related posts

మాకు సభలో ప్రాధాన్యం ఇవ్వండి.. ప్రభుత్వానికి కాంగ్రెస్ డిమాండ్!

Drukpadam

రసకందాయంలో గోవా బీజేపీ…

Drukpadam

సీబీఐ వద్దా?..అయితే న్యాయ విచార‌ణ‌కైనా ఓకే: జితేంద‌ర్ రెడ్డి

Drukpadam

Leave a Comment