హుజూరాబాద్‌లో రాజకీయ వేడి.. పెరిగిన కరోనా కేసులు!

హుజూరాబాద్‌లో రాజకీయ వేడి.. పెరిగిన కరోనా కేసులు!
-రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటిన్నర మందికి వ్యాక్సినేషన్ పూర్తి
-రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందన్న డాక్టర్ శ్రీనివాస్
-హుజూరాబాద్‌లో కేసుల పెరుగుదలపై కలెక్టర్‌తో త్వరలో సమీక్ష

త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా వివిధ పార్టీలన్నీ తమ కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. నాయకులు, కార్యకర్తల రాకపోకలు, సమావేశాలతో హుజూరాబాద్ ప్రతిరోజూ కిక్కిరిసిపోతోంది. ఒక పక్క పాదయాత్రలతో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవనున్న ఈటల ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తున్నారు. మధ్యలో అస్వస్థతకు గురైన ఈటల చికిత్స నిమిత్తం హైద్రాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చేరారు. 10 రోజులపాటు ఆసుపత్రిలో ఉన్న ఈటల గురువారం డిశ్చార్జ్ అయ్యారు. మరో రెండుమూడు రోజుల్లో తిరిగి తన పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇక దళిత బందు పథకం ఇక్కడ నుంచే ఫైలెట్ ప్రాజక్టు గా ప్రకటిస్తామని చెప్పిన కేసీఆర్ సడన్ గా గేర్ మార్చారు. తన దత్తత గ్రామమైన వాసాలమర్రి వెళ్లిన సీఎం అక్కడనే గ్రామస్తులకు 76 మందికి దళిత బందు పథకం కింద అర్హులను ప్రకించారు. మరోసటీ రోజునే వారిఖాతాల్లో 10 లక్షల చొప్పున్న జమ చేశారు. ఇక హుజూరాబాద్లో పథకం ప్రారంభం లాంఛనమే అన్నారు. ఇప్పటికే అధికార టీఆర్ యస్ పార్టీ ఈటల వెంట ఉన్న వాళ్ళను తమవైపుకు తిప్పుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంది. కులాలవారీగా , ప్రాంతాలవారీగా మీటింగులు పెడుతున్నారు. జనాలు గుంపులు గుంపులుగా చేరడంతో కరోనా మహమ్మారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. అది ఇప్పుడు జరుగుతుంది. ….

ఎన్నికల షడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు గాలికి వదిలేస్తుండడంతో, నియోజకవర్గంలో మళ్లీ కొత్త కేసుల పెరుగుదల మొదలైంది. హుజూరాబాద్‌లో కేసుల పెరుగుదల మొదలైనట్టు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. కేసుల పెరుగుదలపై కలెక్టర్‌తో సమీక్షించనున్నట్టు పేర్కొన్నారు.

అయితే, రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం కొవిడ్-19 అదుపులోనే ఉందన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని సందర్శించిన శ్రీనివాస్ అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటిన్నర మందికి కరోనా టీకాలు వేసినట్టు ఆయన తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: