వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది పేర్ని నాని సంచల వ్యాఖ్యలు!

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది పేర్ని నాని సంచల వ్యాఖ్యలు!
-కాషాయం కండువా కప్పుకున్న వ్యక్తి సీఎం కావాలని చూస్తున్నారు
-గతంలో మోడీని తిట్టిన టీడీపీ ఇప్పుడు ప్రేమలేఖలు రాస్తుంది
పులిచింతల మళ్లీ నిండుతుంది… రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్టు గేటు
స్పందించిన మంత్రి పేర్ని నాని
ప్రాజెక్టులో ఇంత నీరు ఎప్పుడూ నిల్వచేయలేదని వెల్లడి
యాంత్రిక తప్పిదం వల్లే ఘటన జరిగిందని వివరణ

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, కాషాయం కండువా కప్పుకున్న వ్యక్తి సీఎం కావాలని కళలు కంటుందని ,మోడీని తిట్టిన టీడీపీ తిరిగి బీజేపీకి ప్రేమలేఖలు రాస్తోందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఏపీ లో పరిపాలన సాగిస్తున్న జగన్ కు ప్రధాని మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న తరుణంలో నాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ రోజు కాబినెట్ సమావేశం అయిన తరువాత ఈ విషయాలు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. నిజంగా ఏమి జరుగుతుంది. జగన్ సర్కారుపై బీజేపీ గురిపెట్టింది. 151 సీట్లు ఉన్న జగన్ సర్కార్ ను అస్థిరపరిచి బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. బీజేపీ ,వైసీపీ మధ్య సంబంధాలు చెడిపోయాయని నాని వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇది రాజకీయంగా పెద్ద దుమారమే ఇదే జరిగితే పెను సంచలనంగా మారటం ఖాయం .జగన్ బెయిల్ పై కోర్టు తీర్పు రావాల్సి ఉన్న వేళ ఇలాంటి రాజకీయపరిణామాలకు చోటు ఉండే అవకాశం ఉందని కూడా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పులిచింతల గేటు కొట్టుకుపోయిన విషయం కూడా పేర్ని నాని మాట్లాడారు … ఆయన మాటల్లోనే …..

పులిచింతల ప్రాజెక్టులో 16వ నెంబరు గేటు వరద నీటి ఉద్ధృతికి కొట్టుకుపోవడంపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పులిచింతల గేటుపై ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు రాష్ట్ర క్యాబినెట్ కు తెలియజేశారని వెల్లడించారు. పులిచింతలలో ఇంత నీరు ఎప్పుడూ నిల్వచేయలేదని వెల్లడించారు. యాంత్రిక తప్పిదం వల్ల గేటు విరిగినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు వివరించారు. హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుకు అధ్యయనం చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్ని నాని వెల్లడించారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహంతో మళ్లీ పులిచింతల నిండుతుందని, కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన రాజకీయ పరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తి సీఎం కావాలన్నది బీజేపీ ఆశ అని వివరించారు. టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యే పార్టీలు అని విమర్శించారు. గతంలో మోదీని తిట్టి ఇప్పుడు ప్రేమలేఖలు రాస్తున్నారని వ్యాఖ్యానించారు.

Leave a Reply

%d bloggers like this: