అమితాబ్‌ బచ్చన్‌ ఇంటికి బాంబు బెదిరింపు కాల్…

అమితాబ్‌ బచ్చన్‌ ఇంటికి బాంబు బెదిరింపు కాల్…
-గుర్తు తెలియ‌ని వ్య‌క్తి బెదిరింపు కాల్
-విస్తృత త‌నిఖీలు
-న‌కిలీ కాల్‌గా తేల్చిన పోలీసులు

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో ముంబయ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. విస్తృత తనిఖీలు చేశారు. చివరకు అది ఫేక్ కాల్ అని తేల్చారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని నెలల క్రితం దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ గ్రూప్ ల అధినేత ముఖేష్ అంబానీ ఇంటి ముందు జిలిటెన్ స్టిక్స్ తో ఉన్న వాహాన్ని ఆయన ఇంటిముందు నిలబెట్టిన సంఘటన సంచలనంగా మారింది. దీనిపై కూపీ లాగిన పోలీసులు పోలీస్ అధికారి ఈ దారుణానికి వడికట్టారని తేల్చారు. ఆయనను అదుపులోకి తీసుకోని కటకటా కల వెనక్కు పంపించారు. ఇప్పడు బిగ్ బీ ఇంటికి బాంబు బెదిరింపు కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్‌ రూమ్‌కు గ‌త రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నివాసంతో పాటు, ముంబైలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లలో బాంబులు పెట్టిన‌ట్లు చెప్పాడు. దీంతో వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగారు. అమితాబ్ నివాసంతో పాటు రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచి, ఆయా ప్రాంతాల్లో త‌నిఖీలు చేశారు.

బాంబులు ఏవీ లభించలేదు. దాంతో అది నకిలీ బెదిరింపు కాల్‌ అని తేలింది. అయిన‌ప్ప‌టికీ ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. కాల్‌ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. ఆగ‌స్టు 15న‌ స్వాతంత్ర్య దినోత్స‌వం సందర్భంగా ఇప్ప‌టికే దేశంలోని ప‌లు ప్రాంతాల్లో పోలీసులు భ‌ద్ర‌త‌ను పెంచారు.

Leave a Reply

%d bloggers like this: