కేంద్రంతో ,జగన్ కు చెడిన స్నేహం … వైసీపీ ,బీజేపీ లమధ్య మాటల యుద్ధం…

కేంద్రంతో ,జగన్ కు చెడిన స్నేహం … వైసీపీ ,బీజేపీ లమధ్య మాటల యుద్ధం…
బీజేపీ వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతుందన్న మంత్రి పేర్ని నాని
-మీ ప్రభుత్వాన్ని మేము కూల్చాల్సిన అవసరంలేదు …మీరే పాతాళమంతా గొయ్యి తవ్వుకున్నారన్న సునీల్ దేవధర్
కాషాయం కండువా కప్పుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలని బీజేపీ అనుకుంటుందన్న పేర్ని నాని
మీ ప్రభుత్వాన్ని మేం కూల్చనవసరం లేదు…ఆ ఆలోచన కూడా మాకులేదన్న దేవధర్
కేంద్రం అప్పులు చేసినా కోట్ల మందికి ఉచితంగా రేషన్, వ్యాక్సిన్ ఇస్తోంది
కేంద్ర ప్రభుత్వంతో మీకు పోలికేంటి? బీజేపీ

ఇంతకాలం స్నేహంగా ఉన్న ఏపీ లోని జగన్ ప్రభుత్వం కు ,మోదినాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఉంది. కేంద్రానికి జగన్ ప్రభుత్వం స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఒకరంటే మరొకరికి గౌరవముంది . కేంద్రం తెచ్చిన అనేక బిల్లులకు జగన్ సర్కార్ మద్దతు పలికింది. బీజేపీ సర్కారుకు అనుకూలంగా పార్లమెంట్ లో అనేక బిల్లులకు ఓటు వేసింది. కాని ఇటీవల కాలంలో ఇద్దరిమధ్య చెడి పోయినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి నిర్ధారిస్తూ వైసీపీ మంత్రి శుక్రవారం కాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ పై విమర్శలు గుప్పించారు. బీజేపీ జగన్ సర్కార్ ను కూల్చేందుకు కుట్రలు పన్నుతోందని పెద్ద బాంబు లాంటి విషయం చెప్పారు. కాషాయం కండువా కప్పుకున్న వ్యక్తిని ఏపీ లో సీఎం పీఠం పై కూర్చోబెట్టాలని బీజేపీ కుట్రలు పన్నుతుండనై కూడా తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. దీనిపై బీజేపీ కి చెందిన ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవధర్ స్పందించారు. మేము ఏపీ లోని జగన్ సర్కార్ ను కూల్చాలని అనుకోవడంలేదని కాకపోతే వారే పాతాళం లోటు గొయ్యి తవ్వుకున్నారని ఎదురు దాడి చేశారు.

వీరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నిజంగా కుట్ర పూరితంగా జగన్ సర్కార్ ను కూల్చే వరకు వెళుతుందా ? లేదా అనే చర్చ జరుగుతుంది. దేవధర్ ఏమన్నారంటే …..

వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారుని కూల్చే కుట్ర‌లు బీజేపీ చేస్తోందంటూ ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌లకు సంబంధించి ఓ దిన‌ప‌త్రిక‌లో వచ్చిన వార్తను పోస్ట్ చేస్తూ.. ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ కౌంట‌ర్ ఇచ్చారు.

‘పేర్ని నాని గారు.. మీ ప్రభుత్వాన్ని మేం కూల్చనవసరం లేదు, ఆ ఆలోచన కూడా మాకులేదు. ఏ క్షణాన బెయిల్ రద్దవుతుందో తెలియక, రోజు గడవడానికి అప్పు పుట్టక, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి, అది చాలదన్నట్టు వేలకోట్ల రూపాయ‌ల‌ అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు’ అని సునీల్ దేవ‌ధ‌ర్ పేర్కొన్నారు.

‘కేంద్రం అప్పులు చేసినా కోట్ల మందికి ఉచితంగా రేషన్, వ్యాక్సిన్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మీకు పోలికేంటి? కేంద్రానికున్న ఆర్థిక స్తోమత, వెసులుబాటు మీ ప్రభుత్వానికున్నాయా? మీలా పప్పు బెల్లాలు పంచడానికి అప్పులు చేయడం లేదు. మేం దేశ ప్రతిష్ఠ‌ పెంచుతుంటే మీరు రాష్ట్రాన్ని ముంచుతున్నారు’ అని సునీల్ దేవధర్ విమ‌ర్శించారు.

Leave a Reply

%d bloggers like this: