Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సరిహద్దులు మూసి ఉన్నా న్యూజిలాండ్‌లో ప్రవేశించిన లారీ పేజ్.. ఎలా వచ్చారో చెప్పిన ఆ దేశ మంత్రి!

సరిహద్దులు మూసి ఉన్నా న్యూజిలాండ్‌లో ప్రవేశించిన లారీ పేజ్..
ఎలా వచ్చారో చెప్పిన ఆ దేశ మంత్రి!
-కుమారుడి చికిత్స కోసం న్యూజిలాండ్‌లో నివాసహక్కును సొంతం చేసుకున్న పేజ్
-రూ. 51 కోట్లు పెట్టుబడి పెడితే ఆటోమెటిక్‌గా వీసా
-కుమారుడి కోసం కివీస్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు
-మండిపడుతున్న ప్రతిపక్షాలు

డబ్బులు ఉంటె కొండమీద కోతి సైతం తెగలమని సామెత ఉంది దాన్ని నిజం చేశారు ఒక డబ్బున్న మారాజు … కరోనా కాలంలో న్యూజిలాండ్ పూర్తిగా లాక్ డౌన్ విధించబడింది. ఇతర దేశాలనుంచి వచ్చేవారికి పూర్తీ నిషేధం …. గూగుల్ సహవ్యవస్థాపకుడైన లారీ ఫేజ్ కుమారుడికి జబ్బు చేసింది. న్యూజిలాండ్ లో వైద్యం అందించాలి కాని దేశంలోకి ప్రవేశం నిషేధం దానితో న్యూజిలాండ్ చట్టాలలో ఒక వెసులుబాటు ఉంది అదేంటంటే ఈ దేశంలో 51 కోట్ల పెట్టుబడి పెడితే వెంటనే వీసా జారీచేస్తారు. ఆయన ధనవంతుడు అయినందున పెట్టుబడి పెట్టి కరోనా సమయంలోను దేశంలో ప్రవేశించేందుకు అనుమతి పొందారు. …

గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీపేజ్ కరోనా సమయంలో న్యూజిలాండ్‌లో ప్రవేశించడం అప్పట్లో పెను చర్చకు దారితీసింది. సరిహద్దులు మూసేసి, విదేశీయలను అడుగుపెట్టకుండా కాపుకాసిన న్యూజిలాండ్ లారీపేజ్‌కు మాత్రం ద్వారాలు తెరిచింది. నిజానికి న్యూజిలాండ్ పౌరులకు మాత్రమే ఆ అవకాశం ఉంది. మరి లారీపేజ్ దేశంలోకి ఎలా రాగలిగారన్న దానిపై ఆ దేశ మంత్రి ఆండ్రూ లిటిల్ పార్లమెంటుకు తెలిపారు.

జనవరికి కొన్ని నెలల ముందు లారీ పేజ్ కుటుంబం ఫిజీలో నివసించింది. ఆ సమయంలో పేజ్ కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అత్యవసర చికిత్స నిమిత్తం అతడిని న్యూజిలాండ్ తరలించాలని పేజ్ భావించారు. అయితే, న్యూజిలాండ్‌‌లోకి విదేశీయులకు ప్రవేశం లేదు. దీంతో ఏం చేయాలా? అని ఆలోచించిన పేజ్.. ఆ దేశం అమలు చేస్తున్న ప్రత్యేక నిబంధన గురించి తెలిసి అప్పటికప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఆ దేశంలోకి ప్రవేశించగలిగారు. వివారాలు చూద్దాం ….

న్యూజిలాండ్‌లో కనీసం రూ. 51 కోట్లు పెట్టుబడి పెట్టేవారికి ప్రభుత్వం ప్రత్యేక వీసా మంజూరు చేస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న పేజ్ అప్పటికప్పుడు న్యూజిలాండ్‌లో నివాస హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ వెంటనే అధికారులు ఆమోదించడంతో పేజ్ తన కుమారుడిని న్యూజిలాండ్‌కు తరలించి చికిత్స చేయించగలిగారు. అయితే, సంపన్నులు ఇలా అప్పటికప్పుడు నివాస హక్కును సొంతం చేసుకోవడంపై ఆ దేశ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.

Related posts

పుతిన్ బతికున్నాడో లేదో అనుమానమే!: జెలెన్ స్కీ

Drukpadam

సరుకులు మోసుకుంటూ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన చైనా వ్యోమనౌక!

Drukpadam

ఫోర్జరీ కేసులో అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

Drukpadam

Leave a Comment