విమానంలో యువకుడి వెకిలి చేష్టలు.. సీటుకు కట్టేసిన సిబ్బంది!

విమానంలో యువకుడి వెకిలి చేష్టలు.. సీటుకు కట్టేసిన సిబ్బంది!
-ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళ్తున్న విమానంలో ఘటన
-మహిళా సిబ్బందిని తాకరాని చోట తాకుతూ వెకిలి చేష్టలు
-అడ్డుకున్న తోటి ప్రయాణికులతో వాగ్వివాదం

ఇటీవల కాలంలో విమానాల్లో ప్రయాణిస్తున్న సందర్భాలలో కొంతమంది గొడవకు దిగటం పరిపాటిగా మారింది . సీటు విషయంలో తేడా వచ్చిన ఒక జంటపై ఒకతను ఏకంగా దాడిచేశారు. ఇరువురి మధ్య కుస్తీ జరిగిన కుస్తీ యుద్ధం విమానంలో ప్రయాణిస్తున్న వారిని బెంబేలు ఎత్తించింది. అలంటి ఘటన ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళ్తున్న విమానంలో జరిగింది. విమాన సిబ్బందిని ఇబ్బందులు పెట్టడమే కాకుండా వారిని తాకారని చోట తాకిన ఘటన విమానంలో చోటు చేసుకోవడం తోటి ప్రయాణికులు నచ్చచెప్పిన వినకపోవడంతో విమానంలోనే ఆతన్ని తాళ్లతో గట్టిగా కట్టేసి , నోరుతెరకుండా ప్లాస్టర్ వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…..

విమానంలో ఓ యువకుడి అసభ్య ప్రవర్తనకు విసిగిపోయిన సిబ్బంది అతడిని సీటుకు కట్టేశారు. విమానం ల్యాండయ్యాక అతడిని పోలీసులకు అప్పగించారు. ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళ్తున్న విమానంలో అమెరికాకు చెందిన మాక్స్‌వెల్ బెర్రీ (22) అనే యువకుడు ప్రయాణిస్తూ అసభ్య చేష్టలకు దిగాడు. మహిళా సిబ్బందిని తాకరాని చోట తాకుతూ వారిని ఇబ్బంది పెట్టాడు. అతడి వెకిలి చేష్టలు భరించలేని తోటి ప్రయాణికులు ప్రశ్నిస్తే వారితోనూ వాగ్వివాదానికి దిగాడు.

యువకుడి తీరుతో విసుగు చెందిన విమాన సిబ్బంది అతడిని పట్టుకుని కూర్చున్న సీట్లోనే కట్టిపడేశారు. మాట్లాకుండా నోటికి టేప్ అతికించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 12.7 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో తనను కాపాడాలంటూ యువకుడు అరుస్తున్న మరో వీడియో కూడా వైరల్ అయింది. కాగా, విమానం ల్యాండ్ అయ్యాక విమాన సిబ్బంది యువకుడిని పోలీసులకు అప్పగించారు. మియామీలో పోలీసులు యువకున్ని ఆడిపోలోకి తీసుకోని ప్రశ్నిస్తున్నారు. ఆయన మానసిక స్థితిపై దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: