బాత్రూంలో జారిపడిన మంద కృష్ణ… అపోలో ఆసుపత్రికి తరలింపు!

బాత్రూంలో జారిపడిన మంద కృష్ణ… అపోలో ఆసుపత్రికి తరలింపు!
-ఆసుపత్రిపాలైన మంద కృష్ణ
-కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన నేత
-ఓ రెసిడెన్షియల్ కాంపెక్స్ లో జారిపడ్డ వైనం
-ఆసుపత్రికి తరలించిన అనుచరులు

మంద కృష్ణ మాదిగ ఢిల్లీ పర్యటనలో ఉండగా తాను ఉంటున్న వెస్ట్రన్ కోర్టు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోగ గదిలోని బాత్రూమ్ లో జారిపడ్డారు. దీంతో ఆయన కు తీవ్ర గాయాలైయ్యాయి. వెంటనే ఢిల్లీ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. గతంలో కొంతకాలం హిల్ చైర్ పైనే తిరిగిన మంద కృష్ణ కోలుకొని తిరుగుతున్నారు.

కేంద్రమంత్రులను కలవడానికి ఢిల్లీ వచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీలోని వెస్ట్రన్ కోర్ట్ రెసిడెన్షియల్ కాంప్లెక్సులోని బాత్రూంలో ఆయన జారిపడడంతో గాయాలయ్యాయి. దాంతో ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం మంద కృష్ణ పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మంద కృష్ణ కు గాయాలైన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆయన ఆరోగ్య విషయమై ఆరా తీస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: