చీరాల వైసీపీ ఎమ్మెల్యే కరుణం వర్సెస్ ఆమంచి వర్గాల ఘర్షణ!

చీరాల వైసీపీ ఎమ్మెల్యే కరుణం వర్సెస్ ఆమంచి వర్గాల ఘర్షణ
-ఎమ్మెల్యే సాక్షిగా పిడిగుద్దులు కురిపించుకున్న వైనం
-గవినివారిపాలెంలో మెగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం
-తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
-తనపై కొందరు దాడికి పాల్పడ్డారంటూ బుర్ల మురళి ఫిర్యాదు

వైసీపీ లో ఆయా నియోజకవర్గాలలో వర్గపోరు ఎక్కువుతుంది. నెల్లూరులో మంత్రి కొందరు ఎమ్మెల్యే లకు మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థిలు ఉన్నాయి. స్థానిక ఎంపీ , మధ్య ఎమ్మెల్ మధ్య కూడా పొసగడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పార్టీ లోసంతృప్తిగా లేరనే ప్రచారం జరుగుతుంది. కృష ,గుంటూరు జిల్లాలో కూడా పరిస్థిని అంతంతమాత్రమే , తూర్పు గోదావరి జిల్లాలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చెంద్రశేఖర్ రెడ్డి మధ్య కూడా జిల్లాపరిషత్ సమావేశంలో పెద్ద రభసనే జరిగింది. దీనిపై సీఎం సీరియస్ అయ్యారు. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ , ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మధ్య తగాదాలు ఉన్నాయి. శ్రీకాకుళంలో అదే పరిస్థితి , కడపలో ప్రత్యేకించి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి , రామసుబ్బారెడ్డి మధ్య వర్గపోరు చల్లారటం లేదు.

ప్రకాశం జిల్లా చీరాల మండలంలో వైసీపీలోని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. మండలంలోని గవినివారిపాలెంలో మెగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే నిన్న గ్రామానికి వచ్చారు. తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ శ్రేణుల మధ్య ఏర్పడిన వివాదం క్రమంగా తీవ్ర స్థాయికి చేరుకుంది.

దీంతో రెచ్చిపోయిన ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎమ్మెల్యే, పోలీసులు సర్దిచెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది. కాగా, అధికార పార్టీ నేత బుర్ల మురళి ఈ ఘటనపై ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కొందరు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: