నేడు బీఎస్పీలోకి ప్రవీణ్ కుమార్.. నల్గొండలో రాజ్యాధికార సంకల్ప సభ!

నేడు బీఎస్పీలోకి ప్రవీణ్ కుమార్.. నల్గొండలో రాజ్యాధికార సంకల్ప సభ!
-సభకు లక్ష మందికిపైగా సమీకరణ
-ముఖ్య అతిథిగా బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్
-ప్రత్యేక అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్

ఇటీవల తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేడు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరనున్నారు. నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో నేడు నిర్వహించనున్న రాజ్యాధికార సంకల్ప సభలో ఆయన బీఎస్పీ తీర్థం పుచ్చుకోనున్నారు

గురుకులాల్లో తనదైన ముద్ర వేసి ఇటు విద్యార్థులు ,అటు సిబ్బంది మన్నలను పొంది ఇటీవలనే రిటైర్ మెంట్ ప్రకటించిన ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ ఫుల్ టైం రాజకీయనాయకుడు అవతారం ఎత్తనున్నారు. ఇందుకు నల్లగొండ వేదికగా ఆయన అధికారికంగా బీఎస్పీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రవీణ్ కుమార్ చేరికతో తెలంగాణాలో బీఎస్పీ బలోపేతం అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రవీణ్ కుమార్ వివిధ జిల్లాలో పర్యటించారు .తన సంబంధాలని పార్టీ రూపంలో మలచగలరా ? లేదా ? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో బీఎస్పీ ఉన్నప్పటికీ దాని ఉనికి ఇప్పటివరకు పెద్దగా లేదు. ప్రవీణ్ కుమార్ .బీఎస్పీ ని రాష్ట్రంలో విస్తరించే దిశగా ఆలోచనలు చేయాల్సి ఉంది. అంటే క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మించాల్సి ఉంది. ప్రవీణ్ కుమార్ స్వరో లతో పార్టీ బలబడుతుందా? అనేది చూడాలి . రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఐక్యం చేయడంలో ఇప్పటివరకు అనేక మండి ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ప్రవీణ్ కుమార్ ఎంతవరకు సక్సెస్ అవుతారో అనే ఆశక్తి రాజకీయవర్గాలలో నెలకొన్నది.

నల్లగొండ సభకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ సంకల్ప సభకు లక్ష మందికిపైగా బహుజన ఉద్యమకారులు, స్వేరో సంస్థ కార్యకర్తలు హాజరు కానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

%d bloggers like this: