తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలో కంపించిన భూమి!

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలో కంపించిన భూమి
నల్లగొండ ,పులిచింతల , సూర్యాపేట లలో భూప్రకంపనలు

ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఉదయం భూప్రకంపనలు కలకలం సృష్టించాయి.
ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.పులిచింతల, సూర్యపేటలో భూమి కంపించింది.
ఉదయం 7 :15 నిల నుంచి 8:20 ని మధ్య మూడు సార్లు భూమి కంపించి, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3గా నమోదైంది. సూర్యాపేట, చింతలపాలెం, మేళ్లచెరువు మండలాలల్లో భూమి కంపించిది. వారం రోజులుగా పులిచింతలలో భూమి కంపింస్తున్నట్లు అధికారులు తెలిపారు.కాగా, భూ కంపం సంభవించినట్లు ఎన్జీఆర్ఐ నిర్ధారించిది.

గుంటూరు జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు నమోదయ్యాయి. గంట వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించింది. అమరావతి ప్రాంతం సీస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుందంటూ ఇదివరకు శివరామకృష్ణన్ కమిటీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో- అదే ప్రాంతంలో ఉన్న గుంటూరు జిల్లాలో గంట వ్యవధిలో మూడుసార్లు భూప్రకంపనలు నమోదు కావడం ఉలికిపడేలా చేస్తోంది. తాజాగా నమోదైన ఈ ప్రకంపనల తీవ్రత స్వల్పంగా ఉండటం కొంత ఊరట కలిగించినప్పటికీ- ఈ ప్రాంతం సీస్మిక్ జోన్-3 పరిధిలో ఉండటం వల్ల మున్ముందు భారీ భూకంపాలకు అవకాశం ఉండదనే అంచనాలు ఉన్నాయి. ఈ ఉదయం గుంటూరు జిల్లాలోని పులిచింత‌ల స‌మీపంలో భూప్ర‌కంప‌న‌లు సంభవించాయి. ఉద‌యం 7:15 నిమిషాల నుంచి గంట వ్యవధిలో అవి చోటు చేసుకున్నాయి. వాటి తీవ్రత తక్కువే. 7:15 నిమిషాలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైంది. ఆ తరువాత కూడా వరుసగా రెండుసార్లు భూమి ప్రకంపించింది. వాటి తీవ్ర‌త 2.3, 2.7గా నమోదైనట్లు భూగర్భ నిపుణులు వెల్లడించారు. పులిచింత‌ల‌తో పాటు తెలంగాణ సరిహద్దుల్లోనూ దీని తీవ్రత కనిపించింది. తెలంగాణలోని చింత‌ల‌పాలెం, మేళ్ల‌చెరువు మండ‌లం, సూర్య‌పేట‌్‌లో స్వ‌ల్పంగా భూమి ప్రకంపించిన‌ట్టు నిర్ధారించారు.
భూపొర‌ల్లో వ‌స్తున్న మార్పుల కార‌ణంగా భూప్ర‌కంప‌న‌లు సంభవిస్తున్నాయని అంచనా వేస్తోన్నారు. అమరావతి ప్రాంతం సీస్మిక్ జోన్ 3 పరిధిలోకి వస్తుందనేది తెలిసిన విషయమే. తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం, వరంగల్ ఏపీలోని చిత్తూరు, కడప, గుంటూరు, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం సీస్మిక్ జోన్-3 పరిధిలోకి వస్తాయి. సీస్మిక్ జోన్-3 కింద కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉన్నాయంటూ ఇదివరకే శివరామకృష్ణన్ కమిటీ చేసిన హెచ్చరికలు తాజాగా భూప్రకంపనలతో వార్తల్లోకి ఎక్కాయి. జోన్-3లో ఉన్న ప్రాంతాల్లో భూ ప్రకంపనలు తప్ప, భారీ భూకంపాలు సంభవించే అవకాశం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

 

Leave a Reply

%d bloggers like this: