రతన్ టాటాను రాష్ట్రపతి చేయాలి -పవన్ కు ఇరకాటమేనా : మెగా బ్రదర్ వ్యాఖ్యలతో కలకలం..

రతన్ టాటాను రాష్ట్రపతి చేయాలి -పవన్ కు ఇరకాటమేనా : మెగా బ్రదర్ వ్యాఖ్యలతో కలకలం..
-రాష్ట్రపతిగా రతన్ టాటా పేరు ప్రతిపాదన..
-జనసేనకు సమాచారం ఉందా..
-నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు
-ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారా..
-పవన్ అభిప్రాయమూ అదేనా..
-వైసీపీ మద్దతుతోనే రాష్ట్రపతి అభ్యర్ధి గెలుపు..

మెగా బ్రదర్ కొత్త నినాదం ఎత్తుకున్నారు. తన డిమాండ్ ఏంటో బయట పెట్టారు. రాష్ట్రపతి పదవి ఎవరికి ఇవ్వాలో సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం అటు రాజకీయంగా…ఇటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేసారు. అందులో ప్రస్తుతం దేశంలో నెలకొన్ని విపత్కర పరిస్థితుల్లో ఎత్తులు-వ్యూహాలు-నిర్ణయాలు అమలు చేసే వ్యక్తి కాకుండా.. పెద్ద మనసుతో – జాతి మొత్తాన్ని ఒక పెద్ద కుటుంబంగా భావించే వ్యక్తి రాష్ట్రపతి కావాలని ఆకాంక్షించారు.

అందు కోసం రతన్ టాటా పేరును తాను ప్రతిపాదిస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం దాదాపుగా ఇంకా పది నెలలకు పైగా ఉంది. దీని పైన జాతీయ స్థాయిలో అప్పుడప్పుడు చర్చలు జరుగుతున్నా…నిర్దిష్టంగా ఎవరు పోటీలో ఉంటారనే అంశం పైన మాత్రం క్లారిటీ లేదు. కానీ, ఇంత సడన్ గా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక అంశం పైన నాగబాబు ఎందుకు స్పందించారనేది అంతు చిక్కని విషయం. ఆయన వ్యక్తిగతంగా రతన్ టాటాను రాష్ట్రపతిగా కోరుకోవటంలో అభ్యంతరం లేకపోయినా… ఆయన ఇప్పటికీ జనసేనలో ఉన్నారు.

జనసేన-బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతోంది. కేంద్రంలో తదుపరి రాష్ట్రపతి ఎంపిక పైన అధికారంలో ఉన్న బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎలక్ట్రాల్ కాలేజ్ లో ఉన్న బలం ఆధారంగా రాష్ట్రపతి ఎంపిక జరుగుతుంది. జనసేనకు రాష్ట్రపతి- ఉప రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్ట్రోల్ కాలేజ్ లో ప్రాతినిధ్యం లేదనే చెప్పాలి. అసెంబ్లీలో ఉన్న ఒక్క అభ్యర్ధి వైసీపీని అనధికారంగా మద్దతిస్తున్నారు. అయితే, నాగబాబు దేశంలో పరిస్థితులను వివరిస్తూ…ఎలాంటి రాష్ట్రపతిని కోరుకుంటున్నారో చెబుతూ ప్రస్తావించిన అంశాల పైన చర్చ జరగుతోంది.

ఎవరినైనా ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసారా .. అలా వ్యవహరిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే, వ్యాపార రంగంలో రాణించి.. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకొనే రతన్ టాటా పేరును సైతం ఆకస్మికంగా ఈ సమయంలో నాగబాబు ఎందుకు ప్రస్తావించారనే ఆసక్తి కర చర్చ సాగుతోంది. రతన్ టాటాను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు బీజేపీ నుంచి ఏమైనా జరుగుతున్నాయా.. మిత్రపక్ష పార్టీగా జనసేనకు ఆ రకమైన సంకేతాలు ఏమైనా అందాయా అనేది మరో ప్రశ్న.

రాష్ట్రపతి ఎన్నిక గురించి ప్రస్తావిస్తూ..ఎత్తుకు పై ఎత్తు వేసే వారు కాకుండా అంటూ నాగబాబు తన ట్వీట్ లో ప్రస్తావించటం పెద్ద దుమారమే రేపుతోంది. ఆయన ఉద్దేశం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎవరు ఆ రకంగా ఎత్తుకు పై ఎత్తులు వేసారనే ప్రశ్నలు మొదలయ్యాయి. రాష్ట్రపతి పదవి గురించి స్పందించే సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు సరైనవేనా అనే చర్చ వినిపిస్తోంది. టాటా కుటుంబం దేశానికి అందించిన సేవల కారణంగానే ఆయన పేరు నాగబాబు ప్రస్తావించారని సన్నిహితులు చెబుతున్నారు.

భారతీయుడిగా పుట్టాను కలాం తరహాలో రాష్ట్రపతిగా రతన్ టాటా సమర్ధుడిగా నాగబాబు చెబుతున్నారు. అయితే, రతన్ టాటా కంటే సమర్ధులు లేరా అంటే తాను సమాధానం చెప్పలేనని వ్యాఖ్యానించారు. రతన్ టాటా బ్రహ్మచారిగా ఉంటూ.. దేశానికి ఎంతో సేవలు చేసారని చెప్పారు. గతంలో రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని కోరగా..తాను భారతీయుడిగా పుట్టటమే గొప్పగా ఆయన భావించారని… తనకు అది చాలంటూ..ఇక, భారత రత్న ఎందుకని ప్రశ్నించిన గొప్ప వ్యక్తి రతన్ టాటా అంటూ నాగబాబు కీర్తించారు.

తన వ్యక్తిగత అభిప్రాయంటూ రతన్ టాటా పేరు ను నాగబాటు ప్రతిపాదించానా.. దీని పైన పవన్ స్పందించాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక, ప్రస్తుత రాష్ట్రపతి – ఉప రాష్ట్రపతి ఎంపిక సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ- వైసీపీ-టీఆర్ఎస్ మూడు పార్టీలు బీజేపీ ప్రతిపాదిత అభ్యర్ధులకే మద్దతు ప్రకటించారు. ఇక, రాష్ట్రపతి ఎన్నికలకు ముందే అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అందులో ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటే కాషాయ పార్టీకి ఎలక్ట్రోల్ కాలేజ్ లో బలం పెరుగుతుంది.

రాజ్యసభలో సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయినా..రాజ్యసభలో వచ్చే ఏడాది మరో నాలుగు సీట్లు వైసీపీకి పెరగనున్నాయి. వీటి ద్వారా వైసీపీ బలం పదికి చేరుతుంది. దీంతో.. .బీజేపీ రాష్ట్రపతి ఎన్నికతో పాటుగా పెద్దల సభలో కీలక బిల్లులకు వైసీపీ మద్దతు అవసరం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇక, కొద్ది కాలం క్రితం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి రేసులో ఉన్నారనే ప్రచారం సాగుతున్నా..ఆయన ఖండించారు. ఏది ఏమైనా…ఇప్పుడు నాగబాబు సడన్ గా రాష్ట్రపతి పేరు ప్రతిపాదించటం.. అందుకు చెప్పిన కారణాలు మాత్రం చర్చకు కారణమవుతున్నాయి. ఇక, దీని పైన నాగబాబు మరలా స్పష్టత ఇవ్వటం లేదా జనసేన నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

Leave a Reply

%d bloggers like this: