Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

మా లో రాజకీయాలు 2 కోట్ల నిధులకు లెక్కలు లేవన్న హేమ…ఆమె క్రమశిక్షణ తప్పెరన్న నరేష్!

మా లో రాజకీయాలు 2 కోట్ల నిధులకు లెక్కలు లేవన్న హేమ…ఆమె క్రమశిక్షణ తప్పెరన్న నరేష్!
-సినీ న‌టి హేమ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ‘మా’ అధ్య‌క్షుడు న‌రేశ్ స్పంద‌న‌!
-మా అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్య‌లు
-హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తాం
-కమిటీ తీసుకునే నిర్ణయం ప్రకారం తగిన చర్యలుంటాయన్న నరేశ్

మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) లో రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయి. పరస్పరం ఫిర్యాదులు …ఆరోపణలు ,ప్రత్యారోపణలతో ” మా” ను సభ్యులే బజారుకు ఈడ్చడంపై సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా కు సీనియర్ నటుడు కృషంరాజు ఆధ్వరంలో క్రమశిక్షణ సంఘం ఉన్నప్పటికీ క్రమశిక్షణ ఉల్లంఘించినవారిపై చర్యలు లేకపోవడం పట్ల విమర్శలు ఉన్నాయి.

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు టాలీవుడ్ లో వేడి పుట్టిస్తోన్న విష‌యం తెలిసిందే. ప్రకాశ్ రాజ్, జీవిత, మంచు విష్ణు, హేమ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతూ ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటోన్న వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే మా అధ్య‌క్షుడు నరేశ్‌ ఇప్పటివరకు ఖర్చు చేశారని, మిగతా డ‌బ్బంతా ఏమైంద‌ని హేమ ఇటీవ‌ల నిల‌దీసిన విష‌యం తెలిసిందే. ఈ విషయంపై 200 మంది అసోసియేషన్‌ సభ్యులకు హేమ లేఖలు రాశారు.

హేమ చేసిన వ్యాఖ్య‌లపై న‌రేశ్ తో పాటు జీవితా రాజ‌శేఖ‌ర్ స్పందించారు. హేమ చేసిన ఆరోప‌ణ‌ల‌ను న‌రేశ్ ఖండిస్తూ ఈ రోజు ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. మా అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, ఆమెపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కమిటీ తీసుకునే నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు.

కొవిడ్ ప‌రిస్థితుల‌ దృష్ట్యా ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని, పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని నరేశ్ చెప్పారు.

మరోపక్క, హేమ చేసిన వ్యాఖ్య‌లు స‌రికాద‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ అన్నారు. మా స‌భ్యుల‌ను తిక‌మ‌క పెట్టేలా వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని ఆమె హితవు పలికారు. నిధులు ఉండేది స‌భ్యుల కోస‌మేన‌ని, అవేమీ సొంత ప్ర‌యోజ‌నాల‌కు వాడుకునేందుకు కాద‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ చెప్పారు. స‌భ్యులు వారికి ఇష్టం వ‌చ్చిన వారికి ఓట్లు వేస్తారని, వారికి ఆ స్వేచ్ఛ ఉంటుంద‌ని ఆమె అన్నారు.

Related posts

నాకు అఫైర్లు ఉన్నాయట… నేను అవకాశవాదినట!: రూమర్లపై సమంత ఆవేదన!!

Drukpadam

ఎవరు చెప్పార్రా నీకు?: కోపంతో ఊగిపోయిన దిల్ రాజు

Ram Narayana

విశాల్ లంచం ఆరోపణలపై స్పందించిన కేంద్రం, సీరియస్‌‌గా తీసుకున్న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ

Ram Narayana

Leave a Comment