తాటికొండ రాజయ్య  వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ భేటీ లో వాస్తవమెంత ?

తాటికొండ రాజయ్య  వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ భేటీ లో వాస్తవమెంత ?
ఎమ్మెల్యే రాజయ్య అనిల్ ను కలిశాడంటూ వార్తలు …. కలవలేదన్న రాజయ్య
జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉంటా: తాటికొండ రాజయ్య
నేను లోటస్ పాండ్ కు వెళ్లలేదు రాజయ్య స్పష్టికరణ
వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దన్న రాజయ్య
కడియం శ్రీహరికి, నాకు మధ్య ఆధిపత్య పోరు ఉంది
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న భేటీ

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య భేటీ అయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. . నిన్న వీరి భేటీ జరిగిందని విశ్వసనీయ వర్గాలు చెపుతున్నాయి. అయితే రాజయ్య ఈ విషయాన్నీ ఖండిస్తున్నారు. తాను లోటస్ ఫాండ్ కు వెళ్లలేదని అంటున్నారు . ఆయన లోటస్ ఫాండ్ కు వెళ్లినట్లు వార్తలు రాలేదు . ప్రవేట్ గా ఒకచోట కలిశారని ఆ వార్తల సారాంశం . పైగా వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని రాజయ్య అంటున్నారు. అందువల్ల ఆయన లోటస్ ఫాండ్ కు వేళ్ళని మాట నిజమే అయిన వారిద్దరూ కలిసినట్లు రాజయ్య మాటల్లో అర్థం అవుతుంది. పైగా తాను పార్టీ మారబోనని జీవితాంతం టీఆర్ యస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు.

అయితే, హైదరాబాదులోని లోటస్ పాండ్ లో కాకుండా… ఒక ప్రైవేట్ ప్రదేశంలో వీరిద్దరూ సమావేశమైనట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా బ్రదర్ అనిల్ కుమార్ తో రాజయ్య తరచుగా సమావేశమవుతున్నారని చెపుతున్నారు. వీరి భేటీపై వైయస్సార్టీపీ వర్గీయుల్లో అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతోందట. అయితే వీరిద్దరి మధ్య భేటీ రాజకీయపరమైనదా? లేక మత పరమైనదా? అనే విషయంలో క్లారిటీ లేదు. వ్యక్తిగా విషయాలను పార్టీతో ముడి పెట్టవద్దని రాజయ్య అంటున్నారు . వారిద్దరిమద్య ఎదో రహస్యం అయితే ఉందనే అభిప్రాయం కలుగుతుంది.

బ్రదర్ అనిల్ కుమాతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భేటీ అయ్యారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో రాజయ్య స్పందించారు . తాను లోటస్ పాండ్ కు వెళ్లలేదని ఆయన అన్నారు. బ్రదర్ అనిల్ ను తాను కలవలేదని చెప్పారు. వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దని అన్నారు. పాత ఫొటోలను ఉపయోగిస్తూ తాను పార్టీ మారబోతున్నట్టు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలతో మనసును గాయపరచొద్దని చెప్పారు.

తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయేలా తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారని… తాను జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉంటానని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వలేకపోయారు కాబట్టే.. ఇప్పుడు దళితబంధులను తీసుకొస్తున్నారని చెప్పారు.

కడియం శ్రీహరికి, తనకు మధ్య ఆధిపోరు ఉందని రాజయ్య అన్నారు. తామిద్దరం ఒకే జాతి బిడ్డలమని, అందుకే తమ మధ్య పోటీ ఉందని చెప్పారు. ఆయన రెండు సార్లు గెలిస్తే… తాను నాలుగు సార్లు గెలిచానని అన్నారు. కొన్ని విషయాల్లో శ్రీహరిని తాను ఆదర్శంగా తీసుకుంటానని.. అందుకే గురువుని మించిన శిష్యుడిని అయ్యానని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: