మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు కరోనా పాజిటివ్!

మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు కరోనా పాజిటివ్
-ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్
-ఆదివారం నల్గొండ సభలో పాల్గొన్న వైనం
-బీఎస్పీలో చేరిక
-రెండ్రోజుల నుంచి నీరసంగా ఉందని వెల్లడి
-స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్టు వివరణ

ఇటీవలనే బీఎస్పీ చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆ పార్టీ రాష్ట్ర సామాన్య కర్త ప్రవీణ్ కుమార్ కు కరోనా సోకింది. ఆదివారం నల్లగొండ లో జరిగిన పెద్ద బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనేక మందితో నేరుగా కలుసుకున్నారు. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు గౌతమ్ కూడా ప్రవీణ్ ని హత్తుకున్నారు. చాలామంది వేదికను పంచుకున్నారు. వారందరు క్వారంటైన్ కు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతె మరింత మందికి కరోనా సోకె అవకాశం ఉంది. అంతకు ముందు కూడా ప్రవీణ్ కుమార్ అనేక జిల్లాలో పర్యటించారు. తనతో అనేక మంది సన్నిహితంగా మెలిగారని వారందరు క్వారంటైన్ లోకి వెళ్లాలని ప్రవీణ్ కుమార్ సూచించారు.

ప్రవీణ్ కుమార్ కు కరోనా సోకినా విషయాన్నీ ఆయనే స్వయంగా వెల్లడించారు. . రెండ్రోజులుగా నీరసంగా ఉండడంతో కొవిడ్ టెస్టు చేయించుకున్నానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆ టెస్టులో కరోనా పాజిటివ్ అని వచ్చిందని, దాంతో గాంధీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నానని, ఆపై డిశ్చార్జి అయ్యానని వెల్లడించారు.

తాను స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. తనతో సన్నిహితంగా మెలిగినవారు దయచేసి ఐసోలేషన్ లోకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

మొన్న ఆదివారం నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సభలోనే ఆయన బీఎస్పీ కండువా కప్పుకున్నారు. ప్రవీణ్ కుమార్ కు బీఎస్పీ అధిష్ఠానం రాష్ట్ర సమన్వయ కర్త పదవిని అప్పగించింది.

Leave a Reply

%d bloggers like this: