ఈనెల 13 లేదా 14 న హుజురాబాద్ ఉప ఎన్నిక షడ్యూల్ వచ్చే అవకాశం…

ఈనెల 13 లేదా 14 న హుజురాబాద్ ఉప ఎన్నిక షడ్యూల్ వచ్చే అవకాశం…
-అప్రమత్తమైన రాజకీయపార్టీలు
-అందుకే వాసాలమర్రిలో దళితబందు కు శ్రీకారం చుట్టిన కేసీఆర్
– మళ్ళీ ఈటల పాదయాత్ర …
-అభ్యర్థి వేటలో కాంగ్రెస్ …దళిత కార్డు పై తర్జన భర్జన
-టీఆర్ యస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ?

హుజురాబాద్ ఉపఎన్నిక షడ్యూల్ ఏక్షణంలోనైనా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉండటంతో రాజకీయపాటీలు అప్రమత్తమైయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 13 వరకు ఉన్నందున షడ్యూల్ 13 లేదా 14 తేదీలలో వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందని అనుకుంటున్నా హుజురాబాద్ ఎన్నికను రాజకీయపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి .ప్రత్యేకించి అధికార టీఆర్ యస్ కు ఈ ఎన్నికకు చావో రేవో అనే పద్దతిలో ఉంది. హుజురాబాద్ లో అధికార టీఆర్ యస్ ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో వెంటనే అధికార పార్టీకి వచ్చిన నష్టమేమి లేనప్పటికీ 2023 చివరలో జరగనున్న ఎన్నికలకు ఇది రిహార్సల్ లాగానే ఉంటుందనే దానిలో ఎలాంటి సందేహం లేదు .అందువల్ల పాలక పార్టీ ఈ ఎన్నిక విషయంలో ఉలిక్కి పడుతుంది. కోసం పథకాలను పెట్టేందుకు పరుగులు తీస్తుంది . సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి ఉపఎన్నికలు కొంత అడ్వాంటేజ్ గానే ఉంటాయి. ఇక్కడ టీఆర్ యస్ పార్టీ దాన్ని మరింత ఎక్కువగా చేస్తుందనే అభిప్రాయాలూ కలుగుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు హుజురాబాద్ మీద కురుస్తున్నాయి. నిధులు వరదలై పారుతున్నాయి. దీనికి తోడు దళిత బందు పథకం తో దళితుల ఓట్లను గంప గుత్తగా తమకు అనుకూలంగా పోల్ చేయించుకోవాలని పట్టదలతో టీఆర్ యస్ పావులు కదుపుతుంది. నియోజవర్గంలో దాదాపు 42 వేల దళిత ఓట్లు ఉన్నాయి. అందులో 22 వేల మందికి పథకాన్ని అందించాలని కేసీఆర్ వ్యూహరచనలు చేస్తున్నారు

దళిత బందు వికసిస్తుందా? వికటిస్తుందా ?

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ యస్ దళిత బందు పథకాన్ని తెచ్చింది. ఇది దళితులకు చేదోడుగా నిలిచే పథకమే అనడంలో ఎలాంటి సందేహం లేదు…. ఈ పథకం పై ఇప్పడే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెడుతుందని దానిపై అందరికి క్లారిటీ ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా తమది మఠం కాదని రాజకీయపార్టీ అని కుండబద్దలు కొట్టారు. ఇది కేవలం ఈటల రాజేందర్ ను హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఓడించేందుకే తెచ్చారని విమర్శలు ఉన్నాయి. కొందరు దళిత యువకులు ఈటల వల్లనే తమకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని బహిస్తున్నారు . దీంతో ఈటల కు నియోజకవర్గంలోని కొందరు యువకులు పాలతో కాళ్ళను కడగటం విశేషం . ఈ పథకం ఆయన వల్లనే వచ్చిందని తాము నమ్ముతున్నామని కూడా అంటున్నారు. అందువల్ల తమకు ఓట్లు రాలాలని టీఆర్ యస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకున్న పథకం వికసిస్తుందా ? వికటిస్తుందా ? అనే సందేహాలు వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి.

హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో దళిత బందు పథకాన్ని ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆయన ఇందుకోసం అఖిల పక్ష సమావేశాన్ని వేర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ ప్రతిపక్షాలను ప్రగతి భవన్ మెట్లు ఎక్కేందుకు అంగీకరించని ముఖ్యమంత్రి స్వయంగా కొన్ని పార్టీలకు ఫోన్లు చేసి మరి పిలిచారు. ఈ సమావేశాన్ని బీజేపీ బాయ్ కట్ చేయగా మిగతా పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. దీన్ని ఉపఎన్నికలు జరగనున్న హుజురాబాద్ నుంచే ఫైలెట్ ప్రాజెక్టు గా మొదలు పెడతామని సీఎం ప్రకటించారు. దీనిపై అనేక అవిమర్శలు వచ్చాయి. కేవలం ఓట్ల కోసమే సీఎం ఈ పథకాన్ని తెస్తున్నారని ఆరోపించాయి .దానిపై సీఎం కూడా ఘాటుగానే స్పందించారు. మేము ఏమైనా సన్యాసులమా బారాబర్ ఓట్లకోసమే పథకాలు తెస్తాం … ఇందులో రహస్యం ఏముంది అని కుండబద్దలు కొట్టారు. తమది మఠం కాదు రాజకీయపార్టీ అనికూడా స్పష్టం చేశారు. దళిత బందు పై హుజురాబాద్ నియోజకవర్గ దళితులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పటివరకు అధికార టీఆర్ యస్ గాని కాంగ్రెస్ పార్టీ గాని అభ్యర్థులను నిర్ణయించలేదు. అధికార టీఆర్ యస్ ఇప్పటికి ఒక అంచనాకు వచ్చి ఉంది. మాజీ విద్యార్ధి నాయకుడు గెల్లు శ్రీనివాస్ ను తమ అభ్యర్థిగా పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. బీసీ యాదవ్ కులం కు చెందిన శ్రీనివాస్ మొదటినుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉన్నారు. నియోజకవర్గంలో యాదవ్ లకు గణనీయమైన ఓట్లు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో తర్జన భర్జనలు పడుతుంది. ఎస్సీ ని పెట్టాలా బీసీ ని పెట్టాలా ? అనే దానిపై ఆలోచలను చేస్తుంది. ప్రస్తుతం ముగ్గురి నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి;వారిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ , మాజీ మంత్రి కొండా సురేఖ , సాంబయ్య , సత్యనారాయణ లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నియోజవర్గ ఇంచార్జి గా ఉన్న దామోదర రాజనరసింహ పేరుకూడా ప్రచారంలో ఉంది.

Leave a Reply

%d bloggers like this: