Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజురాబాద్ లో హరీష్ రావు హల్చల్ …బైక్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరించిన మంత్రి!

హుజురాబాద్ లో హరీష్ రావు హల్చల్బైక్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరించిన మంత్రి
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థితో క‌లిసి ర్యాలీలో పాల్గొన్న మంత్రి హ‌రీశ్ రావు!
శ్రీరాంపూర్ బ్రిడ్జి క్యాంప్ ఆఫీసు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ
ఈనెల 16 తేదీన హుజూరాబాద్‌ మండలం శాలపల్లిలో కేసీఆర్‌ సభ
అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల ప‌రిశీల‌న‌

హుజురాబాద్ లో హరీష్ రావు ఎంట్రీతో టీరియస్ లో జోష్ పెరిగింది. మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన హరీష్ కు టీఆర్ యస్ కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు; హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జిగా ఆయన ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. పార్టీ అధికారికంగానే గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించింది. టీఆర్ యస్ విద్యార్ధి విభాగానికి నాయకుడైన శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రము కోసం జరిగిన ఉద్యంలో పాల్గొన్నారు. బీసీ అయినా శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక్కడ యాదవ్ ల ఓట్లు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి.

హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్ కీల‌క నేత‌లు ఆ నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభించారు. ఈ రోజు మంత్రులు హ‌రీశ్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్ శ్రీరాంపూర్ బ్రిడ్జి క్యాంప్ ఆఫీసు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న‌ విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్‌వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను పార్టీ అభ్య‌ర్థిగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈనెల 16వ తేదీన హుజూరాబాద్‌ మండలం శాలపల్లిలో కేసీఆర్‌ సభ ఉన్న‌ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ పరిశీలిస్తున్నారు. కాసేప‌ట్లో అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్ నేత‌లు నివాళులర్పించనున్నారు. అనంత‌రం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్క‌డి నుంచి జమ్మికుంట మీదుగా భారీ ర్యాలీతో ఇల్లందకుంటకు చేరుకుంటారు. అక్కడి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారు. ఆ త‌ర్వాత వీణవంకలో జ‌ర‌గ‌నున్న సభకు హాజ‌ర‌వుతారు.

Related posts

దేవినేని ఉమా స్వాతంత్ర పోరాటం చేశాడని పలకరించడానికి వచ్చారా?: చంద్రబాబుపై కృష్ణప్రసాద్ విసుర్లు!

Drukpadam

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ సీటు …జరుగుతున్న చర్చ…

Drukpadam

కేంద్రమంత్రి నారాయణ్ రాణేను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు!

Drukpadam

Leave a Comment