Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్లమెంట్ సమావేశాలు వాష్ అవుట్ కావడంపై వెంకయ్యనాయుడు కంట కన్నీరు!

సమావేశాలు వాష్ అవుట్ కావడంపై వెంకయ్యనాయుడు కంట కన్నీరు!
– ఆశించిన స్థాయిలో స‌భ జ‌ర‌గ‌క‌పోవ‌డం బాధించింది.. స్పీకర్ ఓం బిర్లా
=పెగాసస్ గొడవతోనే షడ్యూల్ కన్నా ముందే ముగిసిన పార్లమెంట్ సమావేశాలు
-లోక్‌స‌భ ప్ర‌తిష్ఠ‌ను త‌గ్గించేలా ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు
-షెడ్యూల్ క‌న్నా ముందే లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా
-వివ‌రాలు తెలిపిన‌ స్పీక‌ర్ ఓం బిర్లా
-20 కీల‌క బిల్లుల‌కు ఆమోద ముద్ర
-21 గంట‌ల 14 నిమిషాల పాటు స‌భ‌

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అనుకున్న సమయంకన్నా ముందే ముగిశాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్య సమావేశాలు తరుచు వాయిదా పడుతూ వచ్చాయి. దీనిపై అధికారపక్షం ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లోకసభ ,రాజ్యసభ లోను ఇదే సీన్ రిపీట్ అయింది.దీనిపై రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు భావోద్యోగానికి లోనైయ్యారు. సమావేశాలు వాష్ అవుట్ కావడంపై కన్నీరు పెట్టారు. సభలో జరుగుతున్నా తీరుపై నిద్రలేని రాత్రులు గడిపానని కన్నీటి పర్వ వంతమైన వెంకయ్యనాయుడు నోటినుంచి మాటరాలేదు . దీనితో సభ ఒక క్షణం నిర్ఘాంత పోయింది.

రాజ్య‌స‌భ‌లో ఛైర్మ‌న్‌ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గుర‌య్యారు. రాజ్యసభలో కొందరు సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం, కొందరు ఎంపీలు బల్లలపై కూర్చోవడం వంటి చ‌ర్య‌ల‌తో సభ పవిత్రత దెబ్బతిందని వెంక‌య్య నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాగే, నిన్న‌టి ప‌రిణామాలు త‌లుచుకుంటే నిద్ర‌ప‌ట్టే ప‌రిస్థితి లేద‌ని వ్యాఖ్యానించారు. ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన ప‌రిస్థితి అని ఆయ‌న చెప్పారు.

అంతేకాదు, భావోద్వేగంతో కంట‌త‌డి పెట్టారు. ప్రజాస్వామ్యానికి పార్ల‌మెంటు దేవాల‌యంలాంటిద‌ని అన్నారు. అయినప్పటికీ, అదే స‌మ‌యంలోనూ కొందరు సభ్యులు నిరసనలు కొనసాగించారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్న‌ట్లు వెంకయ్య నాయుడు ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు, పెగాస‌స్‌, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలు వంటి అంశాల‌పై ప్ర‌తిప‌క్షాలు పార్ల‌మెంటులో పెద్ద ఎత్తున ఆందోళ‌న కొన‌సాగిస్తుండ‌డంతో షెడ్యూల్ క‌న్నా ముందే లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పెగాసస్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టి, లోక్‌స‌భ‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విష‌యం తెలిసిందే. సభా కార్యకలాపాలను అడ్డుకుంటుండ‌డంతో స‌భలో చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశం లేకుండా పోయింది. అయిన‌ప్ప‌టికీ, గంద‌రగోళం మ‌ధ్యే ప‌లు కీలక బిల్లులన్నింటినీ ఎలాంటి చర్చ లేకుండానే కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదింప‌జేసుకుంది.

 

ప్ర‌తిప‌క్షాలు పార్ల‌మెంటులో పెద్ద ఎత్తున ఆందోళ‌న కొన‌సాగిస్తుండ‌డంతో షెడ్యూల్ క‌న్నా ముందే లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో లోక్‌స‌భ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై స్పీక‌ర్ ఓం బిర్లా వివ‌రాలు తెలిపారు. ఆశించిన స్థాయిలో స‌భ జ‌ర‌గ‌క‌పోవ‌డం బాధించింద‌ని చెప్పారు. లోక్‌స‌భ ప్ర‌తిష్ఠ‌ను త‌గ్గించేలా ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించార‌ని ఆయ‌న అన్నారు.

లోక్‌స‌భ‌లో 20 కీల‌క బిల్లుల‌కు ఆమోద ముద్ర ప‌డింద‌ని వివ‌రించారు. ఓబీసీ బిల్లుకు అన్ని పార్టీలు స‌హ‌క‌రించాయ‌ని చెప్పారు. వ‌ర్షాకాల స‌మావేశాలు మొత్తం 21 గంట‌ల 14 నిమిషాల పాటు జ‌రిగాయ‌ని వివ‌రించారు. కాగా, లోక్‌స‌భ స‌మావేశాలు జులై 19 నుంచి నేటి వ‌ర‌కు జ‌రిగాయి. సమావేశాలు ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 13 వరకు జరగాల్సి ఉండగా రెండు రోజుల ముందే అంటే 19 రోజులు జ‌ర‌గాల్సి ఉండ‌గా, కేవలం 17 రోజులు మాత్రమే జరిగాయి. షెడ్యూల్ క‌న్నా రెండు రోజుల ముందే ముగిశాయి.

Related posts

రఘురామరాజును అనర్హుడిగా ప్రకటించండి వైసీపీ…

Drukpadam

కాంగ్రెస్​ తో పొత్తా?.. ఆ ప్రసక్తే లేదు: తేల్చి చెప్పిన అఖిలేశ్​ యాదవ్​…

Drukpadam

వడ్ల కొనుగోలు బీజేపీ వైఖరి…ఢిల్లీ వేదికగా నిప్పులు చెరిగిన తెలంగాణ మంత్రి నిరంజ‌న్ రెడ్డి!

Drukpadam

Leave a Comment