దళిత బందు కొత్త చిక్కులు …లబ్ది దారుల ఎంపికపై గరం గరం!

దళిత బందు కొత్త చిక్కులు …లబ్ది దారుల ఎంపికపై గరం గరం!
-ద‌ళిత బంధు కోసం హుజూరాబాద్‌లో ఎస్సీల ఆందోళ‌న‌.. భారీగా నిలిచిపోయిన వాహ‌నాలు
-ల‌బ్ధిదారుల జాబితాలో త‌మ పేర్లు లేవ‌ని ఆందోళ‌న‌
-లబ్ది ధరలు జాబితాలను చించివేసిన వైనం
-కొంద‌రికి మాత్ర‌మే రూ.10 ల‌క్ష‌లు ఇస్తున్నార‌ని ఆగ్ర‌హం
-వరంగ‌ల్-కరీంన‌గ‌ర్ ర‌హ‌దారిపై వాహ‌నాలు నిలిచిపోయిన వైనం

తెలంగాణ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన దళిత బందు మంచి ఎంత జరుగుతుందో తెలియదు కానీ దాని వాళ్ళ లబ్ది పొందేవాళ్ళకన్నా ,పొందని వాళ్ళ సంఖ్యా ఎక్కువగా ఉంటుంది . అందువల్ల పథకంతో ఎస్సీ లను తమవైపుకు తిప్పుకుని గంగుత్తగా ఓట్లు పొందుదామనుకున్న టీఆర్ యస్ కు ఇబ్బందులు తప్పేట్లు లేవు. ఉపఎన్నిక జరగనున్న హుజురాబాద్ కు ఆదరాబాదరాగా 500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం మొత్తం 44 వేలమంది ఎస్సీ ఓటర్లు ఉంటె కేవలం 5 వేలమందికి మాత్రమే ఈ పథకం వర్తించే విధంగా లబ్ది దారుల ఎంపిక జరిగింది. దీనిపై మిగతా 39 మంది ఓటర్ల లో ఎక్కువమంది సర్కార్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో సర్కార్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.

హుజూరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16న దళితబంధు పథకాన్ని పైల‌ట్ ప్రాజెక్టు కింద‌ అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేశారు. హుజూరాబాద్‌లోనే ఉంటూ దళిత బంధు కార్యక్రమం ప్రారంభోత్స‌వ‌ ఏర్పాట్లను తెలంగాణ‌ మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

దళిత బంధు పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలు కోసం రూ.500 కోట్లు విడుదలయ్యాయి. అయితే, ఈ ప‌థ‌కం ల‌బ్ధిదారులుగా కొంద‌రిని మాత్ర‌మే ఎంపిక చేయ‌డం ప‌ట్ల హుజూరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దళితులు ఆందోళన బాట ప‌ట్టారు.

ప‌లు చోట్ల‌ అధికారుల నుంచి ద‌ళిత బంధు ల‌బ్ధిదారుల‌ జాబితాను తీసుకుని చించేశారు. హుజూరాబాద్ పెద్ద‌పాప‌య్య ప‌ల్లి క్రాస్ రోడ్, అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద ఈ రోజు ఎస్సీలు పెద్ద ఎత్తున‌ ఆందోళ‌న చేప‌ట్టారు. ద‌ళిత బంధు అంద‌రికీ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఎస్సీల ఆందోళ‌న‌ల‌తో వరంగ‌ల్-కరీంన‌గ‌ర్ ర‌హ‌దారిపై వాహ‌నాలు నిలిచిపోయాయి.

Leave a Reply

%d bloggers like this: