దళితబంధు అమలు చేయకపోతే టీఆర్ఎస్ కే నష్టం: కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

దళితబంధు అమలు చేయకపోతే టీఆర్ఎస్ కే నష్టం: కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!
-దళితబంధు కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల సాయం
-పథకాన్ని పూర్తిగా అమలు చేయకపోతే ఓటమి తప్పదన్న శ్రీహరి
-ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్య

ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం దళితబంధు పథకం చుట్టూ తిరుగుతోంది. ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయనున్నారు. ఎల్లుండి హుజూరాబాద్ సభలో కొందరు లబ్ధిదారులకు కేసీఆర్ చెక్కులను అందించనున్నారు.

మరోవైపు హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు కొందరికి మాత్రమే కాకుండా దళిత కుటుంబాలన్నింటికీ ఒకేసారి సాయాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తూ హూజురాబాద్ లో దళితుల ధర్నాకు దిగారు.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దళితబంధును పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే టీఆర్ఎస్ కే నష్టమని అన్నారు. ఈ పథకాన్ని అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. టీఆర్ యస్ ముఖ్యనేత ఈ వ్యాఖ్యలు చేయడంపై రాజకీయవర్గాలలో ఆశక్తి నెలకొన్నది .

Leave a Reply

%d bloggers like this: