హుజూరాబాద్ టీఆర్ఎస్‌దే.. సర్వేలు మాకే అనుకూలం: కేసీఆర్!

హుజూరాబాద్ టీఆర్ఎస్‌దే.. సర్వేలు మాకే అనుకూలం: కేసీఆర్!
-ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన గెల్లు శ్రీనివాసయాదవ్
-కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతానని ధీమా
-టీఆర్ఎస్‌పై ప్రజాభిమానాన్ని చాటే గొప్ప అవకాశం వచ్చిందన్న కేసీఆర్

హుజూరాబాద్‌‌లో సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, ఈ ఉప ఎన్నిక అభివృద్ధి, సంక్షేమ పథకాల వ్యతిరేకులకు చెంపపెట్టు అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ నిన్న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తనకు టికెట్ కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, హుజూరాబాద్‌లో గెలిచి పార్టీ ప్రతిష్ఠను పెంచుతానని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో యువ సత్తా చాటి గులాబీ జెండాను ఎగురవేయాలని శ్రీనివాసయాదవ్‌కు సూచించారు. టీఆర్ఎస్‌పై ప్రజాభిమానాన్ని తెలియజెప్పేందుకు వచ్చిన చక్కని అవకాశమే హుజూరాబాద్ ఉప ఎన్నిక అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా దళిత బంధు ఇచ్చి తీరుతాం: మంత్రి హరీశ్ రావు

ఎవరెన్ని కుట్రలు చేసిన దళిత బందు ఇచ్చి తీరుతామని మంత్రి హరీష్ రావు అన్నారు. కొంతమంది దళిత బందు పై చేస్తున్న ప్రచారంపై ఆయన మండిపడ్డరు. దళితబందు తో తమ పీఠాలు కదులుతున్నాయని కొన్ని రాజకీయపార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు.

ఈ నెల 16న హుజూరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ లోనే మకాం వేశారు.

ఈ నేపథ్యంలో హరీశ్ రావు మాట్లాడుతూ, ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందని అన్నారు. రైతు బంధుపై దుష్ప్రచారం చేసినట్టే, ఇప్పుడు దళిత బంధుపైనా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దళిత బంధు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. నిజంగానే దళితులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలని అన్నారు. కేంద్రం నిధులు ఇస్తే ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని వెల్లడించారు.

Leave a Reply

%d bloggers like this: