మద్యంలో సైనైడ్ కలిపి ముగ్గురిని హత్యచేసిన స్థానిక డాక్టర్

ఖమ్మంజిల్లా చంద్రుతండలో ఘటన

పాతకక్షలతోనే విషం కలిపినట్లు నిర్ధారణ

పోలీసుల అదుపులో నింధితుడు చిన్నా

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రుతండాలో బోడ భిక్షం కుమారుడు బోడ అర్జున్‌ దశదినకర్మ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి సమీప బంధువులు బోడ హరిదాసు(60), మల్సూరు(57), భద్రు(30) మద్యం తాగి… భోజనం చేస్తూ స్పృహ కోల్పోయి మరణించారు. భోజనంలో విషం కలిపినట్లు అనుమానించి స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు చిన్నా ఇంటిపై మృతుల కుటుంబసభ్యులు దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. బంధువులు తాగిన మద్యంలో సైనైడ్‌ కలిపినట్లు నిర్ధారణ అయింది. పాత కక్షలతోనే ఆర్ఎంపీ వైద్యుడు చిన్నా మద్యంలో సైనైడ్‌ కలిపినట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నా ప్రస్తుతం ఖమ్మం పోలీస్‌ స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్నారు.

Leave a Reply

%d bloggers like this: