సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణ: సీఎం కేసీఆర్!

సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణ: సీఎం కేసీఆర్!
-రాష్ట్రంలో ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాం
-రాష్ట్రాభివృద్ధికి స‌ర్కారు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది
-రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తోంది
-విద్యుత్‌, తాగు, సాగునీటి సమస్యలను ప‌రిష్క‌రించాం
-దేశానికే ఆద‌ర్శంగా నిలిచాం

గోల్కొండ కోటలో తెలంగాణ‌ సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డితో పాటు ప‌లువురు అధికారులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగిస్తూ… రాష్ట్రాభివృద్ధికి త‌మ స‌ర్కారు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంద‌ని చెప్పారు.

రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తోంద‌ని తెలిపారు. ప్రగతి ఫలాలు ప్రజలకు అందుతున్నాయ‌ని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామ‌ని తెలిపారు. ఆయా అంశాల్లో త‌మ ప్ర‌భుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింద‌ని తెలిపారు. ఏడేళ్లలో స్థిర ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ఆయ‌న అన్నారు. రైతు బందు , దళిత బందు పథకాల విశిష్టతను సీఎం వివరించారు. ప్రజల సమస్యల పరిష్కరించటంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని అన్నారు.

స్వాతంత్య్ర పోరాట ఉజ్వల ఘట్టాలను దేశం స్మరించుకుంటోందని ఆయ‌న తెలిపారు. స్వాతంత్య్ర‌ ఫలాలను సమీక్షించుకోవాల్సిన అవసరముందని అన్నారు. కాగా, స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో మంత్రులు అధికారులు జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ‌ మంత్రి మహమూద్‌ అలీ పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఖమ్మం లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ , వరంగల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , సూర్యాపేట లో మంత్రి జగదీష్ రెడ్డి , సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు , మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,జాతీయజెండాలను ఎగురవేశారు.

Leave a Reply

%d bloggers like this: