జ్యోతుల నెహ్రు కు గుండెపోటు …చంద్రబాబు పరామర్శ!

జ్యోతుల నెహ్రు కు గుండెపోటు …చంద్రబాబు పరామర్శ!
నిన్న స్వల్ప గుండెపోటుకు గురైన టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ..
ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన పలువురు నేతలు
నిన్న పొలంలో ఉండగా అస్వస్థతకు గురైన జ్యోతుల
రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి తరలింపు
ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గుండెపోటుకు గురయ్యారు. నిన్న సాయంత్రం పొలంలో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఫోన్ ద్వారా ఆయనను పరామర్శించారు.

మరోవైపు పలువురు టీడీపీ నేతలు ఈరోజు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయనను పరామర్శించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, రామకృష్ణారెడ్డి, గన్ని కృష్ణ, రాజా, ఎస్వీఎస్ అప్పలరాజు ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా జ్యోతులను పరామర్శించారు. మరోవైపు నెహ్రూకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జ్యోతుల నెహ్రు 2014 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీచేసి విజయం సాధించారు. అనంతరం ఆయన అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశంలో చేరారు. అప్పటినుంచి ఆయన తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. జడ్పీటీసీ ,ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేయకూడదని చంద్రబాబు నిర్ణయించడటంతో దానికి నిరసనగా తెలుగుదేశంలో ఉన్న ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

Leave a Reply

%d bloggers like this: