Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు!

చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు!
ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడే చంద్రబాబును జైలుకు పంపి అంతమొందించాల్సింది
అదే జరిగి ఉంటే నేడు గుంటూరు లాంటి ఘటనలు తలెత్తేవి కావు
విద్యాకానుక ప్రజల్లోకి వెళ్లకుండా లోకేశ్ నాటకాలు

ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రభుత్వం చేసే పనులను ప్రజల్లోకి వెల్లకొండ చూడాలని ప్రధానప్రతిపక్షం టీడీపీ తీవ్రంగానే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే . అందుకు కొన్ని మీడియా సంస్థలు కూడా తోడుకావడంతో టీడీపీ ప్రచారం సహజంగానే చాలాతేలిక అవుతుంది. ఇది మొదటినుంచి ఉన్నదే . అదే సందర్భంలో అధికార వైకాపా పార్టీ కూడా టీడీపీ పై అదేపనికి విమర్శలు గుప్పిస్తోంది. ప్రధానంగా కోడలి నాని నోటికొచ్చినట్లు మాట్లాడం కొంత ఇబ్బందికరంగానే మారింది. విమర్శలు ప్రతి విమర్శలు సహజం అయినప్పటికీ అయి శృతిమించుతున్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఇవి ముఖ్యమంత్రి కి తెలిసి జరుగుతున్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే అధికారంలో ఉన్న పార్టీ భాద్యతగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. కానీ ఏపీ లో అది జరగటం లేదు . అందువల్ల జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి తగు విధంగా కట్టడి చేయకపోతే ఆ పార్టీకి , ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు జగన్ ను సమర్థించేవాళ్ళు నుంచి కూడా వ్యక్తం అవుతుండటం గమనార్హం.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో నిన్న మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడే చంద్రబాబును జైలుకు పంపించి అంతమొందించి ఉండాల్సిందని అన్నారు. అలా జరిగి ఉంటే గుంటూరు లాంటి సంఘటనలు ఇప్పుడు జరిగేవి కాదని అన్నారు. ఎస్సీ మహిళ శవాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

లోకేశ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. విద్యాకానుక కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు లోకేశ్ కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయాలన్నదే ప్రభుత్వం అభిమతమని, అందుకనే దిశ చట్టం, యాప్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు. గుంటూరు యువతిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు 12 గంటల్లోనే అరెస్ట్ చేశారని మంత్రి తెలిపారు.

Related posts

కృష్ణా కరకట్ట మీద ఉన్నది చంద్రబాబు ఇల్లు కాదు మిస్టర్ సజ్జల …వర్ల …

Drukpadam

హిమాచల్ ప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్!

Drukpadam

ఏపీలో పంచాయతీ ఎన్నికల కయ్యం…

Drukpadam

Leave a Comment