Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెగాసస్ స్కామ్.. బెంగాల్ ప్రభుత్వ విచారణ కమిషన్ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ!

పెగాసస్ స్కామ్.. బెంగాల్ ప్రభుత్వ విచారణ కమిషన్ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ!
-పెగాసస్ పై విచారణకు ద్విసభ్య కమిషన్ వేసిన బెంగాల్ ప్రభుత్వం
-కమిషన్ విచారణను నిలిపివేయాలంటూ దాఖలైన పిల్
-తదుపరి విచారణ ఈనెల 25కి వాయిదా

పెగాసస్ స్కామ్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తించింది. విపక్ష నేతలతో పాటు, ఇతరుల ఫోన్లపై ఈ స్పైవేర్ ద్వారా నిఘా ఉంచారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశం పార్లమెంటును సైతం కుదిపేసింది. మరోవైపు పెగాసస్ పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పకపోవడం, విచారణ జరిపించకపోవడంతో… పశ్చిమబెంగాల్ ప్రభుతం ఈ అంశంలో విచారణకు గాను ద్విసభ్య కమిషన్ వేసింది.

ఈ నేపథ్యంలో, ద్విసభ్య కమిషన్ విచారణను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు… ఇద్దరు సభ్యుల కమిషన్ విచారణను నిలుపుదల చేయాలనే అభ్యర్థనను తోసి పుచ్చింది. మరోవైపు కమిషన్ ఏర్పాటుపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, బెంగాల్ ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. పెగాసస్ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి ఈ పిల్ పై విచారణ జరుపుతామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు.

పెగసెస్ పై పార్లమెంట్ సమావేశాలు దాదాపు ఎలాంటి చర్చలు జరగకుండానే దాదాపు 30 బిల్లులను సభ ఆమోదించడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బిల్లలపై చర్చలు జరగకుండా ఎలా ఆమోదిస్తారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం పార్లమెంట్ లో చర్చకు అవకాశం ఇవ్వలేదు. పార్లమెంట్ సమావేశాల తీరుపై ఇటు పెద్దల సభ ,అటు లోకసభ అసంతృప్తి వ్యక్తం చేశాయి. వెంకయ్య నాయుడు సభ జరిగిన తీరుపై కన్నీటి పరవంతమైయ్యారు. లోకసభ స్పీకర్ ఓంబిర్లా సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రోజు సభ ప్రారంభం కావడం చర్చకు ప్రతిపక్షాలు పట్టు పట్టడం ,ప్రభుత్వం నిరాకరించడం ప్రతిపక్షాల గందరగోళంతో సభలు వాయిదా పడుతూ వచ్చాయి.

దీనిపై బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జరుచేయడం జరిగింది. ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం జరుపుతున్న విచారణపై పిల్ వేయగా దాన్ని సుప్రీం నిరాకరించింది. దీంతో దాని విచారణ కొనసాగ నున్నది.

 

Related posts

ఖమ్మం వేదికగా కాంగ్రెస్ లో కొత్త జోష్

Drukpadam

ప్రాణవాయువు అందిస్తున్న చిరంజీవి అందరికి ఆదర్శప్రాయుడు…. టీఆర్ యస్ నాయకులు శీలం శెట్టి వీరభద్రం

Drukpadam

షుగర్‌, బీపీ రోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త …

Drukpadam

Leave a Comment