బండి సంజయ్‌ బండారం బయట పెడతా : మైనంపల్లి…

బండి సంజయ్‌ బండారం బయట పెడతా : మైనంపల్లి
-ఏఎస్ రావునగర్ రహస్యాలు అన్ని తెలుసు
-దళితులపై దాడి చేసినట్టు తప్పుడు కేసులు పెట్టారు
-నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
-బండి సంజయ్ రాసలీలల గుట్టు విప్పుతా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , టీఆర్ యస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య వార్ కొనసాగుతున్నది. నాలుగురోజుల క్రితం బీజేపీ వారిపై మైనంపల్లి దాడి చేయటం ఆయన పై కేసు నమోదు నేపథ్యంలో లో బీజేపీ ,టీఆర్ యస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం విదితమే . ఇప్పుడు మైనంపల్లి ,బండి సంజయ్ మధ్య యుద్దమాల మారింది. ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. నీ బతుకు ఎంత అంటే నీ బతుకు ఎంత అని సవాళ్లు విసురుకొంటున్నారు. తాజాగా బండి సంజయ్ రహస్యాలు అన్ని తెలుసు ఆయన బండారం బయట పెడతానని మైనంపల్లి అంటున్నారు. దీనిపై బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

త్వరలోనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బండారాన్ని బయటపెడతానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. దళితులపై దాడి చేసినట్టు తనపై తప్పుడు కేసులు పెట్టారని… దాడి జరిగిన సమయంలో తాను ఇంట్లోనే లేనని చెప్పారు. తాను ఇంట్లో ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోనని చెప్పారు. బండి సంజయ్ తో ఎలాంటి చర్చకైనా సిద్ధమని అన్నారు. సంజయ్ ని పదవి నుంచి దింపేంత వరకు నిద్రపోనని చెప్పారు. బండి సంజయ్ ఏఎస్ రావు నగర్ రహస్యాలను బయటపెడతానని… రాసలీలల గుట్టు విప్పుతానని అన్నారు.

Leave a Reply

%d bloggers like this: