Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆరే కోర్టుకు వెళ్లి ‘దళితబంధు’ను ఆపుతారు: ఈటల!

కేసీఆరే కోర్టుకు వెళ్లి ‘దళితబంధు’ను ఆపుతారు: ఈటల
-దళితబంధు పథకంతో నా బొందిగ పిసకాలని చూస్తున్నారు
-దళితులను కేసీఆర్ మొదటి నుంచి మోసం చేస్తూనే ఉన్నారు
-40 ఏళ్లైనా రాష్ట్రవ్యాప్తంగా అమలు సాధ్యం కాదు

దళిత బందు పథకాన్ని రాష్ట్రవ్యాపితంగా అమలు జరుపుతామని ముఖ్యమంత్రి ఘంటా పదంగా చెబుతుంటే ఆయనవి వట్టి మాటలని ఆ పథకం అమలు జరపడం సాధ్యంకాదని కేసీఆర్ కు కూడా తెలుసునని అందుకే ఈ పథకాన్ని ఎవరో అవుతున్నారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ పథకం అమలు పై దళితులూ అప్రమత్తంగా ఉండాలి అన్నారు. పథకాన్ని కొనసాగించలేని కేసీఆర్ కోర్టుల ద్వారా ఆపాలని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో దళితులకు ఇచ్చిన వాగ్దానాలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. దళితులకు 10 ఇస్తామంటే వద్దు అనేవారు ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేవలం హుజురాబాద్ ఎన్నికలకోసం మాత్రమే దళిత బందు పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. ఇది ఈటల రాజేందర్ అనే వాడిని బొందపెట్టాలని బొందిగ నులిపి వేయాలనే ఉద్దేశం తెచ్చిన పథకమని అన్నారు. మంచిదే ఇది నవల్లనే హుజురాబాద్ కు వచ్చింది నిజం కదా ? అని అన్నారు. ఇప్పటికైనా దళితులూ తమకు జరిగిన మోసాలను గ్రహించాలని అన్నారు.

దళితబంధు పథకాన్ని ఎవరో ఆపేస్తారనుకోవడం సరికాదని, ముఖ్యమంత్రి కేసీఆరే కోర్టుకు వెళ్లి ఆపి వేయించేస్తారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిన్న దళిత సంఘాల ఆధ్వర్వంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తన బొందిగ పిసికేందుకే కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారన్ని ఈటల ఆరోపించారు.

నాలుగేళ్లలో దళితబంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారని, కానీ 40 ఏళ్లైనా అమలు సాధ్యం కాదన్నారు. దళితులను కేసీఆర్ మొదటి నుంచి దగా చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పథకం అమలుకు రూ. 2.5 లక్షల కోట్లు అవసరమని, బడ్జెట్ లేకుండా పథకం అమలు ఎలా సాధ్యమని ఈటల ప్రశ్నించారు.

Related posts

కర్ణాటకలో కాంగ్రెస్ దే హవా… బీజేపీ ఖేల్ ఖతం.. !

Drukpadam

ప్రక్షాళన దిశగా టీఆర్ యస్ ….ఢిల్లీ బాట పట్టిన నేతలు!

Drukpadam

లోకల్ వార్ లో కుదేలైన టీడీపీ …ఫ్యాన్ స్పీడ్ కు తిరుగులేదని నిరూపించిన ప్రజలు

Drukpadam

Leave a Comment