భార్య మీద కోపం… మూడేళ్ల కూతుర్ని నేలకోసి కొట్టి చంపిన భర్త!

భార్య మీద కోపం… మూడేళ్ల కూతుర్ని నేలకోసి కొట్టి చంపిన భర్త!
-రాజస్థాన్ లోని అల్వార్ లో దారుణం
-రహస్యంగా మృతదేహం ఖననం
-పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి తల్లి

భార్య మొహానికి ముసుగు వేసుకోలేదన్న కోపంతో.. కన్న కూతుర్ని నేలకేసి కొట్టి చంపాడో కసాయి. తర్వాత ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆ చిన్నారి మృతదేహాన్ని ఖననం చేశాడు. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో గత మంగళవారం జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా బయటకు వచ్చింది. అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రదీప్ యాదవ్ అనే వ్యక్తితో మోనికా అనే యువతికి కొన్నేళ్ల కిందట వివాహం అయింది. వారికి మూడేళ్ల పాప ఉంది. పెళ్లి అయినప్పట్నుంచి ఆచారాల పేరిట ఆమెను ప్రదీప్ ఒత్తిడి చేసేవాడు. మొహానికి ముసుగు వేసుకోవాలంటూ పదే పదే ఇబ్బంది పెట్టేవాడు. ఆమేమో అందుకు నిరాకరించేది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మంగళవారం కూడా భార్యాభర్తల మధ్య ముసుగు విషయంలో గొడవ జరిగింది.

ఆమె ముసుగు వేసుకోననేసరికి కోపంతో ఊగిపోయిన ప్రదీప్.. ఆమెపై చేయి చేసుకున్నాడు. తర్వాత ఆ కోపాన్ని కూతురిపై చూపుతూ, చిన్నారిని కొట్టాడు. భార్య చేతిలో ఉన్న పాపను లాక్కుని బయటకు విసిరేశాడు. దీంతో ఆ చిన్నారి తీవ్రగాయాలపాలై మరణించింది. ఈ విషయం బయటకు పొక్కకుండా తన కుటుంబంతో కలిసి ఆ చిన్నారి మృతదేహాన్ని ప్రదీప్ ఖననం చేశాడు. బుధవారం జరిగిన ఘటనపై బెహ్రార్ పోలీసులకు మోనిక ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు ప్రదీప్ పరారీలో ఉన్నాడు.

Leave a Reply

%d bloggers like this: