Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గోరంట్ల బుచ్చయ్య ఆగ్రహం చల్లారిందా..? ఇది టీ కప్పులో తుఫానేనా ??

గోరంట్ల బుచ్చయ్య ఆగ్రహం చల్లారిందా..? ఇది టీ కప్పులో తుఫానేనా ??
బుచ్చయ్య చౌదరితో చర్చలు జరిపిన టీడీపీ త్రిసభ్య బృందం
కరిగారా? కరిగించారా ?? ఏమి జరిగింది ???
టీడీపీలో గోరంట్ల కలకలం
రాజీనామా చేస్తారంటూ వార్తలు
అప్రమత్తమైన టీడీపీ అధిష్ఠానం
గోరంట్ల వద్దకు త్రిసభ్య బృందం

అసలే అంతంత మంత్రంగా ఉన్న టీడీపీకి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వార్తలు కలకలం పుట్టించాయి. దీనిపై అలర్ట్ అయినా అధిష్టానం రంగంలోకి దిగింది.అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ తొలుత ఎత్తేందుకు నిరాకరించిన గోరంట్ల ,దూతలు వెళ్లిన తరువాత వారి ఫోన్ ద్వారా మాట్లాడారు. మొదటి నుంచి తెలుగు దేశంలో ఉన్న బుచ్చయ్య చౌదరి ఉభయ గోదావరి జిల్లాలలో కీలక నేతగా ఉన్నారు. ఆయన తెలుగు దేశం వైఖరిపై తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. పార్టీ అసలు పట్టించుకోవడం లేదని తన మాటకు విలువలేనప్పుడు పార్టీ లో కొనసాగటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇంత సీనియర్ గా ఉన్న తన పట్ల చూపుతున్న వివక్ష గురించి చంద్రబాబు చెప్పేందుకు ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. సీనియర్ నైనా తనకు కేవలం 7 నెలలు మాత్రమే మంత్రిగా చేసే అవకాశం కలిగిందని అంటున్నారు. తాను ఏనాడూ పైరవీలు చేయలేదని పార్టీని అడ్డం పెట్టుకొని సంప్రదించలేదని , పార్టీ వాళ్ళ తనకు ఉన్న ఆస్తులనే పోగొట్టుకున్నానని మదన పడుతున్నారు.

దీంతో ఆయన పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే పార్టీకి ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పబోతున్నట్లు తన హితులు ,సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. ఇది చంద్రబాబు దృష్టికి పోవడంతో పార్టీని అలర్ట్ చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థిలో బుచ్చయ్య లాంటి సీనియర్ నేత పార్టీ నుంచి బయటకు వెళ్ళితే రాంగ్ సిగ్నల్స్ వెళతాయని భావించిన చంద్రబాబు తన దూతలను బుచ్చయ్య చౌదరి దగ్గరకు బుజ్జగించేందుకు పంపారు .నిన్న ఈ రోజు ఆ బృందం ఆయనతో చర్చలు జరిపింది. దీంతో బుచ్చయ్య మెత్తబడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఆగ్రహం చల్లారింది. దీంతో బుచ్చయ్య కోపం తగ్గిందని , అన్ని పార్టీలో చర్చించి బుచ్చయ్య కు తగిన విధంగా గౌరవ మర్యాదలువుంటాయని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఇది టీ కప్పులో తుఫాన్ నే అని అంటున్నారు…..

గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలకబూనిన వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. గోరంట్లతో చర్చలు జరిపేందుకు త్రిసభ్య బృందాన్ని రాజమండ్రి పంపింది. ఈ బృందంలో సీనియర్ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, జవహర్, గద్దె రామ్మోహన్ ఉన్నారు. ఈ త్రిసభ్య బృందం గోరంట్లతో గంటన్నరసేపు చర్చలు జరిపింది.

అనంతరం గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ, రాజమండ్రిలో తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి గోరంట్ల చెప్పారని వెల్లడించారు. గోరంట్ల సమస్యలను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. గోరంట్ల తెలియజేసిన అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారని గద్దె స్పష్టం చేశారు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలేనని, పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.

Related posts

సాయి గణేష్ హత్యపై సిబిఐ విచారణకు డిమాండ్ :ఈటల రాజేందర్!

Drukpadam

తెలంగాణాలో పొత్తులపై సిపిఐ కార్యదర్శి కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు …

Drukpadam

జులై నుంచి విశాఖలోనే పాలన స్పష్టం చేసిన జగన్ …!

Drukpadam

Leave a Comment