గుర్రానికి బీజేపీ జెండా రంగులు… ఫిర్యాదు చేసిన మేనకా గాంధీ సంస్థ!

గుర్రానికి బీజేపీ జెండా రంగులు… ఫిర్యాదు చేసిన మేనకా గాంధీ సంస్థ!
ఇటీవల మంత్రివర్గ విస్తరణ
జన ఆశీర్వాద యాత్ర చేపట్టిన బీజేపీ
ప్రజలను కలుస్తున్న కొత్త మంత్రులు
ఇండోర్ లో జ్యోతిరాదిత్య సింథియా యాత్ర

ఇటీవల పార్లమెంట్ సమావేశాలకు ముందు బీజేపీ కేంద్రంలో పెద్ద ఎత్తున మంత్రి వర్గ విస్తరణ చేపట్టింది. మంచి ఉత్సవం మీద ఉన్న కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ పని అప్పగించారు. ఇంకేముంది ప్రధాని చెప్పటం మంత్రులు అమలు చేయకపోవడమా ? అందులో భాగంగా దేశ వ్యాపితంగా మంత్రులు యాత్రలు చేపట్టారు. బీజేపీ దేశవ్యాప్తంగా జన ఆశీర్వాద యాత్రలు చేపడుతోంది. తెలుగు రాష్ట్రాలలో కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి యాత్రల చేపట్టగా , మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా వినూత్నంగా గుర్రానికి బీజేపీ జెండా రంగు వేసి యాత్రలో ప్రవేశ పెట్టారు. దీనితో జంతు ప్రేమికులకు కోపం వచ్చింది. ఇది జంతు హింస కిందకే వస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన అనంతరం బీజేపీ దేశవ్యాప్తంగా జన ఆశీర్వాద యాత్రలు చేపడుతోంది. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా నియమితులైన మంత్రులు, ప్రమోషన్లు పొందినవారు ఈ యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఓ గుర్రానికి బీజేపీ జెండా రంగులు వేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా నిర్వహించిన ఈ యాత్రలో గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అయితే, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఇది కచ్చితంగా జంతువులను హింసించడం కిందికే వస్తుందని భావిస్తూ వారు ఇండోర్ లోని సంయోగితా గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు.

Leave a Reply

%d bloggers like this: