తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు!

తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు

  • -కర్ణాటకలో వెంకయ్య పర్యటన
  • -కుటుంబ సభ్యులతో కలిసి రెండ్రోజుల పర్యటన
  • -ప్రత్యేక విమానంలో హుబ్బళ్లి రాక
  • -డ్యామ్ వద్ద ఉల్లాసంగా గడిపిన వెంకయ్య

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సాయంత్రం ఆయన సతీసమేతంగా తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించారు. జలకళ ఉట్టిపడుతున్న తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించే క్రమంలో ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

అంతకుముందు, తన అర్ధాంగి ఉషతో కలిసి వెంకయ్యనాయుడు ప్రత్యేక విమానంలో హుబ్బళ్లి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడినుంచి సైనిక హెలికాప్టర్ లో హోస్పేట చేరుకుని, రోడ్డుమార్గం ద్వారా తుంగభద్ర డ్యామ్ వద్దకు వచ్చారు. వెంకయ్యనాయుడు హెలికాప్టర్ లోంచి తుంగభద్ర అందాలను వీడియోలో బంధించి, ఆ వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు.

కాగా, కర్ణాటకలో రేపు కూడా వెంకయ్యనాయుడు పర్యటన కొనసాగనుంది. రేపు ఉదయం ఆయన చారిత్రక హంపి వద్ద పర్యటించనున్నారు. ఉపరాష్ట్రపతి రాక నేపథ్యంలో, ఆయన పర్యటన కోసం హంపిలో టూరిజం శాఖ అధికారులు బ్యాటరీ వాహనాలు సిద్ధం చేశారు.

Leave a Reply

%d bloggers like this: