కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే సరేసరి లేకపోతె యుద్ధం ఆగదు : వైఎస్ ష‌ర్మిల‌…

కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే సరేసరి లేకపోతె యుద్ధం ఆగదు : వైఎస్ ష‌ర్మిల‌
-హుజూరాబాద్ ఉప ఎన్నికలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయిస్తాం
-అందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు
-ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి నడిపించారు విద్యార్థులు
-4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల‌ను నెరవేర్చారు
-కేసీఆర్ మెడలు వంచాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది

కోట్లాది సాధించుకున్న తెలంగాణ ఆశయాలు నెరవేరటంలేదు అందువల్ల వారిపక్షాన మరింత ఉదృతంగా పోరాటాలు చేయాలనీ వైయస్సార్ టీపీ నిర్ణయించాయింది . అందులో భాగంగా హుజురాబాద్ ఉపఎన్నికల్లో నిరుద్యోగులైన యువతతో వందల సంఖయలో నామినేషన్లు వేయించాలని నిరాయించినట్లు ఆ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ట్విట్టర్ ద్వారా తెలిపారు .
ఇప్పటికే ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు అండగా అనేక కార్యక్రమాలు చేపట్టింది . ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు చేస్తుంది . నిరుద్యోగులైన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని , వారి ఆత్మహత్యలను ఆపాలని షర్మిల వినితినరీతిలో దీక్షలు చేస్తున్నారు. రాష్ట్రము లో అధికారంలో ఉన్న టీఆర్ యస్ ప్రభుత్వానికి హుజురాబాద్ ఎన్నిక కీలకంగా మారటంతో అందరి ద్రుష్టి దానిపై పడింది . అందువల్ల అక్కడే విరివిగా నామినేషన్లు వేయించాలని షర్మిల నిర్ణయించారు .

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గ ఉప ఎన్నిక‌లో వైఎస్సార్‌టీపీ పోటీ చేయ‌ట్లేద‌న్న విష‌యం తెలిసిందే. అయితే, నిరుద్యోగుల‌తో వంద‌ల సంఖ్య‌లో నామినేష‌న్లు వేయించాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆ పార్టీ అధినేత్రి ష‌ర్మిల ట్వీట్ చేశారు.

‘ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి నడిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల‌ను నెరవేర్చింది విద్యార్థులు. 7 ఏండ్ల తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం మరో ఉద్యమాన్ని మొదలు పెట్టింది వైఎస్సార్‌టీపీ. 7 వారాలుగా నిరుద్యోగ నిరాహార దీక్షలతో నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాం’ అని ష‌ర్మిల చెప్పారు.

‘కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడానికి వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి కేసీఆర్ మెడలు వంచాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఇక నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిరుద్యోగ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తుంది. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ యువత పక్షాన నిలబడుతుంది’ అని ష‌ర్మిల తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: