పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ల సాధనకై … చలో ప్రగతి భవన్: పీడీఎస్ యూ పిలుపు!

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ల సాధనకై … చలో ప్రగతి భవన్: పీడీఎస్ యూ పిలుపు
-ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి
-ఈ నెల 24 ప్రగతి భవన్ ముట్టడి ….

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న 3650 మూడు వేల ఆరు వందల యాభై కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయాలని ,ఖాళీగా ఉన్న లక్షా 91 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, డిమాండ్ చేస్తూ ఈనెల 24వ తేదీన పి.డి.ఎస్.యు పి వై ఎల్ కమిటీల ఆధ్వర్యంలో లో జరిగే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పి డి ఎస్ యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము స్థానిక పిడిఎస్యు ఖమ్మం జిల్లా జనరల్ బాడీ లో ముఖ్య వక్తగా పాల్గొని పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ విద్యార్థులను ఉద్యోగులను నిత్యం మోసం చేస్తూన్నాడు, పేద విద్యార్థులు స్కాలర్షిప్ విడుదల చేయడం లేదు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు ఎన్నికలప్పుడు మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ ఊరు దాటాక బోడ మల్లన్న ఏరు దాటినాక బోడి మల్లన్న అన్నట్లు వ్యవహరిస్తున్నాడని వారు ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే కావాల్సినంత స్కాలర్షిప్స్ తిసుకుందామన్నా కే.సీ.ఆర్ పేద విద్యార్థుల ఫీజులు 3650 మూడు వేల ఆరు వందల యాభై కోట్లు పెండింగ్లో ఎలా పెట్టారు అని వారు ప్రశ్నించారు.

కెసిఆర్ మోసాన్ని గ్రహించి విద్యా ఉద్యోగాల హక్కుల కై ఈనెల 24వ తేదీన జరిగే చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విద్యార్థులు విద్యార్థి యువ నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కౌన్సిల్ కార్యక్రమంలో పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు A. శరత్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆజాద్ ,వెంకటేష్ ,ఉపాధ్యక్షులు మస్తాన్, నవీన్ ,సహాయ కార్యదర్శులు పవన్ ,కిరణ్ కోశాధికారి నవ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: