Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అమిత్ షాను కలిసే అవకాశాన్ని కల్పించండి: కిషన్ రెడ్డికి గద్దర్ విన్నపం!

అమిత్ షాను కలిసే అవకాశాన్ని కల్పించండి: కిషన్ రెడ్డికి గద్దర్ విన్నపం!
-తనపై ఉన్న కేసుల గురించి చర్చించిన గద్దర్
-అమిత్ షా అపాయింట్ మెంట్ ఇప్పించాలని విన్నపం
-కేసుల ఎత్తివేత గురించి గతంలో కేసీఆర్ కు విన్నవించిన గద్దర్

ప్రజా గాయకుడు గా పేరొందిన గద్దర్ కేంద్ర హోమ్ మంత్రి అపాయంట్ మెంట్ కోరుతున్నారు. తనపై దేశవ్యాపితంగా అనేక కేసులు ఉన్నాయని వాటిని వెట్టి వేయాలని ఆయన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసేందుకు సిద్ధమౌతున్నారు. అందుకు ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని హైద్రాబాద్ లో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తాను నక్సలిజాన్ని 1990 దశకంలోనే వదిలి పెట్టానని గత మూడుదశాబ్దాలుగా జన జీవన స్రవంతి లో కలిసే ఉన్నానని అయినప్పటికీ తనపై కేసులను వెట్టి వేయలేదని దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా కలిసి విజ్ఞప్తి చేసానని చెప్పారు. గద్దర్ కేంద్ర హోమ్ మంత్రిని కలుస్తానని అందుకు తనకు ఆపాయిట్మెంట్ ఇప్పించాలని కిషన్ రెడ్డి ని కోరడం ఆశక్తిగా మారింది.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రజాగాయకుడు గద్దర్ కలిశారు. దేశ వ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి ఆయనతో చర్చించారు. ఈ కేసులను ఎత్తేయాలని, ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించేందుకు ఆయన అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో ఆయన తన యాత్రను ముగించారు.

తనపై కేసులను ఎత్తేయడానికి, న్యాయ సహాయం అందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని గతంలో గద్దర్ కోరారు. ప్రభుత్వ పిలుపు మేరకు 1990లో నక్సలిజాన్ని వదిలిపెట్టి, తాను జనజీవన స్రవంతిలో కలిశానని చెప్పారు. 1997 ఏప్రిల్ 6న తనపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. తన వెన్నుపూస వద్ద బుల్లెట్ ఇప్పటికీ ఉందని చెప్పారు. ఆ బుల్లెట్ వల్ల తనకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయని, అప్పటి నుంచి తాను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపారు. తాను పరారీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు.

Related posts

చంద్రబాబుకు త్వరలోనే మళ్లీ సీఎం అవుతారు: అశ్వనీదత్

Drukpadam

తాలిబ‌న్లు తీవ్రంగా కొట్టారు: టోలో న్యూస్ జ‌ర్న‌లిస్టు…

Drukpadam

పెద్దల సభకు …బండి పార్థసారథి రెడ్డి , దామోదర్ రావు నామినేషన్ …ఎన్నిక లాంఛనమే !

Drukpadam

Leave a Comment